మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన కోసం కుటుంబమంతా ప్రచారానికి వచ్చింది. పవన్ కల్యాణ్ అయితే రాష్ట్రం మొత్తం తిరిగాడు. అల్లు అర్జున్ - రామ్ చరణ్ అయితే రైలు యాత్ర కూడా చేశారు. గత ఎన్నికల్లో అంటే పవన్ కల్యాణ్ పోటీ లేడు కాబట్టి మెగా హీరోలంతా లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు అలాకాదు పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నాడు. పవన్ అన్నయ్య నాగబాబు నరసాపురం ఎంపీగా బరిలో ఉన్నాడు. అన్నింటికి మించి పవన్ కల్యాణ్ తన పార్టీ తరపున దాదాపు 140 మంది అభ్యర్థుల్ని బరిలో దింపాడు. ఇలాంటి టైమ్ లో పవన్ కోసం ఎవరైనా మెగాహీరోలు ప్రచారానికి వస్తారా లేదా అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతోంది.
ప్రస్తుతానికి మెగా ఫ్యామిలీ హీరోలు ఎవ్వరూ ప్రచారానికి రాకపోయినా.. వారందరి సపోర్ట్ పవన్ కు ఉంది అనేది వాస్తవం. ఎందుకంటే చిరంజీవి ఆజ్ఞ లేకుండా నాగబాబు ఇంట్లోంచి బయటకు కూడా రాడు. అలాంటి నాగబాబు బయటకు వచ్చి పవన్ పార్టీలో చేరి నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఇక రెండు రోజుల క్రితం ఒక మీడియాతో మాట్లాడిన నాగబాబు.. చరణ్ - బన్నీ - వరుణ్ ఇలా అందరూ ప్రచారానికి వస్తారు అని చెప్పాడు. అయితే బన్నీ - చరణ్ ని తాము ఫోర్స్ చెయ్యం కానీ.. వరుణ్ మాత్రం కచ్చితంగా తనకోసం ప్రచారానికి వస్తాడని చెప్పాడు నాగబాబు. అయితే.. ఇటు మెగాహీరోలు కూడా ప్రచారంలోకి వెళ్లాలని అనుకుంటున్నారట. గతంలో సినిమాల విషయంలో - కాంబినేషన్ల విషయంలో పవన్ మెగా హీరోలందరికి బాసటగా నిలిచాడు. ఇప్పుడు రుణం తీర్చుకునే సయమం వచ్చింది కాబట్టి.. రెండు రోజులు ఆలస్యమైనా సరే మెగాహీరోలు ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.