ఏపీలో సత్తా చాటాలని యోచిస్తున్న బీజేపీకి కాలం కలిసిరావడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆ పార్టీ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. ఆ ఎఫెక్ట్ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసింది. బీజేపీ నిలదొక్కుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే పట్టుబట్టి మరీ జనసేనను తప్పించి తిరుపతి ఎంపీ సీటులో పోటీకి దిగింది. జనసేన ఊపు ఉన్నా కూడా బీజేపీనే ధైర్యం చేసింది.
ఇప్పుడు బీజేపీ నిరూపించుకోవాలన్న పట్టుదలగా ఉంది. మిత్రపక్షం జనసేన త్యాగానికి విలువ ఇవ్వాలని లేదంటే చులకన అయిపోతామని బీజేపీ ఏపీ నాయకులు పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలోనే తిరుపతిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట..
ప్రత్యేక హోదా సహా ప్రైవేటీకరణ నుంచి ఏ హామీని నిలబెట్టుకోలేని బీజేపీని ఇప్పుడు ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. దేవాలయాలపై దాడులను కూడా బీజేపీ సమర్థంగా ఎదుర్కోలేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారానికి వెళ్లినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుందని రాష్ట్ర బీజేపీ నాయకులు భావిస్తున్నారు.
బలమైన రత్నప్రభను బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపినా బీజేపీలో భయం నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ వంటి వారిని రంగంలోకి దింపాలని.. హోదా విషయంలో.. ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ప్రజలకు నచ్చ చెప్పించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారట.. వ్యతిరేకతను తగ్గించి తిరుపతిని తమ ఖాతాలో వేసుకోవాలని ఏపీ బీజేపీ నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
మోడీ, షాలతో చెప్పిస్తేనే తిరుపతిలో బీజేపీని నమ్ముతారని.. లేదంటే నమ్మరని నేతలు భావిస్తున్నారట.. వారు వస్తే జనసేనాని పవన్ కూడా వస్తారని.. లేకుంటే పవన్ కూడా రాడని అందుకే మోడీ షాలను రప్పించడానికి ఏపీ బీజేపీ నేతలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారట..ప్రస్తుతం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మోడీ షాలు అసోం, బెంగాల్ పైనే దృష్టిసారించారు. వీరు తిరుపతికి వస్తారా? రారా? అన్నది వేచిచూడాలి.