అదంతా ఎడిట్ చేసిన వెర్షన్..ఎంపీ సోయం బాపూరావు

Update: 2023-06-20 12:02 GMT
తప్పు చేయటం ఒక ఎత్తు. దాన్ని సమర్థించుకోవటం మరో ఎత్తు. ఉన్నది ఉన్నట్లుగా కుల్లాగా మాట్లాడటం అందరికి సాధ్యమయ్యేది కాదు. తమ మీద వచ్చే అవినీతి ఆరోపణల్ని సర్ది చెప్పుకోవటానికి కిందా మీదా పడే నేతల్ని చూశాం. అందుకు భిన్నంగా బీజేపీ ఎంపీ సోయం బాపూరావు కు చెందిన ఒక సంచలన వీడియో వైరల్ గా మారింది. అయితే.. ఆ వీడియో ను ఆయన తప్పు పట్టటం మరో అంశం అనుకోండి.

తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో లో.. పార్టీ కార్యకర్త లతో సమావేశమైన సందర్భంగా ఎంపీ సోయం మాట్లాడుతూ.. "గతం లోని ఎంపీల మాదిరి నేనేమీ ఎంపీ లాడ్స్ నిధుల ను గోల్ మాల్ చేయలేదు. ఒక ఎంపీ గా నాకంటూ సొంత ఇల్లు లేకపోతే గౌరవం ఉండదన్న ఉద్దేశంతో .. ఆ నిధుల తో ఇంటిని నిర్మించా. కొడుకు పెళ్లి చేశా. రెండు మూడు రోజుల్లో రూ.5 కోట్లు వస్తాయన్న సమాచారం వచ్చింది. ఆ నిధుల తో ప్రజోపయోగ పనులు చేస్తా. పార్టీని బలోపేతం చేస్తా" అంటూ ఆయన చెప్పిన మాటల వీడియో ఒకటి వైరల్ గా మారింది.

చేసిన తప్పును ఇంత ఓపెన్ గా ఒప్పుకోవటం ఎంపీ సోయం బాపూరావు గొప్పతనమని.. దాన్ని అభినందించాల్సిన అవసరం ఉందన్న మాటు పలువురి నోట వినిపిస్తోంది. రోటీన్ కు భిన్నంగా సోయం తీరు ఉందన్న వేళ.. ఆయన సీన్లోకి వచ్చారు. వైరల్ అవుతున్న వీడియో లోని మాటల్లో నిజం లేదని.. అదంతా ఎడిట్ చేసిన వెర్షన్ గా పేర్కొన్నారు. ఎంపీ లాడ్స్ నిధుల ను తాను సొంతానికి వాడుకున్నట్లుగా తేలిస్తే తానుతన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

తనను బద్నాం చేయాలన్న ఉద్దేశం తోనే ఈ ప్రచారానికి తెర తీశారన్నారు. తాను పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం చేస్తూ.. ఇబ్బంది పెడుతున్నట్లు చెప్పారు. ఎంపీ లాడ్స్ పనుల కు కలెక్టర్ అనుమతులు ఉంటాయని.. ఇష్టారాజ్యంగా వాడుకోవటానికి అవకాశం లేదని స్పష్టం చేసిన సోయం బాపూరావు.. తన మీద తప్పుడు ప్రచారం చేసే వారి గురించి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కంప్లైంట్ చేస్తానని చెప్పారు.

తనను రాజకీయంగా దెబ్బ తీయటానికి పాయల్ శంకర్.. రాథోడ్ రమేశ్ లు ఇలాంటి పనులు చేస్తారన్నారు. ఎంపీ వ్యాఖ్యల్ని ఖండించేందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నేతలు ప్రెస్ మీట్ పెట్టాలని ముందు అనుకున్నా.. అధినాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల తో ప్రెస్ మీట్ ను క్యాన్సిల్ చేసుకోవటం గమనార్హం.

Similar News