ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అభ్యర్థులు రోడ్ల మీద పడతారు. ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతారు. ఏదో రకంగా ప్రజల నోళ్లలో నానితే చాలనుకుని విమర్శలు - ప్రతివిమర్శలతో దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారు. ఫలితంగా బరిలో ఉన్న వారి పేర్లు ప్రజల నోళ్లలో నానుతూ ఉంటాయి. ఇక, బరిలో ఉన్న అభ్యర్థుల ‘నోట్ల’ పంపకాలు సరేసరి. ఇక - టీవీలు - పేపర్లలో ప్రచారం ఉండనే ఉంది. ఎన్నికలంటే ఇంత తతంగం ఉంటుంది.
ఇంత జరగుతున్నా తమ నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థులెవరో తమకు తెలియదంటే కొంచెం ఆలోచించాల్సిందే. అయితే, నిజంగానే తమకు తెలియదంటున్నారు మధ్యప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామ ప్రజలు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఐదో విడత పోలింగ్ లో మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నియోజకవర్గం కూడా ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులెవరో - వారి పేర్లేంటో కూడా తమకు తెలియదని అంటున్నారు ఈ నియోజకవర్గంలోని భాంద్రపాని ప్రజలు.
విచిత్రం ఏమిటంటే- అభ్యర్థులు ఎవరో - ఏయే పార్టీలు బరిలో ఉన్నాయో తెలియదు కానీ ఓటేసేందుకు మాత్రం ఎనిమిది గంటలు కష్టపడి - కొండలు-గుట్టలు ఎక్కి మరీ వచ్చారు. మారుమూల అటవీ ప్రాంతంలో ఉండే ఈ గ్రామంలోని ప్రజలకు ఇప్పటికీ కనీస సౌకర్యాలు అందని ద్రాక్షగానే మారాయి.
బాహ్యప్రపంచంలోకి రావడానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. కష్టనష్టాలకోర్చి కొండలు - గుట్టలు ఎక్కి దిగాల్సిందే. అయినా, సరే భానుడి భగభగలను లెక్కచేయకుండా - 42 డిగ్రీల ఎండను సైతం తట్టుకుని ఎనిమిది గంటలు ప్రయాణించి మరీ ఓటేసేందుకు వచ్చారు 300 మంది ఓటర్లు.
ఇంకా విస్మయం కలిగించే విషయం ఏమిటంటే- పోటీలో ఉన్నది ప్రధాని నరేంద్రమోదీ - కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథేలేనని వీరు భావిస్తారు. ఎందుకంటే వీరి పేర్లు తప్ప మరెవరివీ వీరికి తెలియదు మరి. ఎన్నికలను ఓట్ల పండుగలా భావించే ఈ గ్రామస్థులు అవి ఎప్పుడొచ్చినా ఇలా ఉత్సాహంగా ఓటు వేసేందుకు వస్తారు.
బేతుల్ జిల్లా కేంద్రానికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాంద్రపాని గ్రామంలో మొత్తం 60 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలోని ఓటర్లంతా పోలింగ్ కు ముందు రోజే ఓటేసేందుకు బయలుదేరుతారు. మార్గమధ్యంలో ఎక్కడా ఆహారం - నీళ్లు దొరకవు కాబట్టి తమతోపాటే అవి తెచ్చుకుంటారు. గంటలపాటు నడిచి చివరికి కొండదిగువన ఏర్పాటు చేసిన ఇమ్లిఖేడా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారు. ఓటేసిన తర్వాత మళ్లీ వచ్చిన దారినే వెళతారు. ఓటేసేందుకు వీరు పడే తాపత్రయం చూసి అందరూ భేష్ అంటూ కొనియాడుతున్నారు.