ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం అత్యంత కీలకమైన అసెంబ్లీ సీటు. ఇక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు గెలుపుని ఎపుడూ పంచుకుంటూ వస్తూండేవి. కాంగ్రెస్ ప్లేస్ లో వైసీపీ నిలిచింది. ఫస్ట్ టైం 2019లో వైసీపీ ఈ సీటుని గెలుచుకుంది. రెండవసారి కేతిరెడ్డి వెంకటరామిరెర్డ్డి ఎమ్మెల్యే అయ్యారు. అంతకు ముందు ఆయన 2009లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇక ఆయనకు గొనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరికి మధ్య మూడు ఎన్నికల నుంచి పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే 2009లో వరదాపురం సూరి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 42 వేల పై చిలుకు ఓట్లు సాధించారు. 2014 నాటికి టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో ఓడాక ఆయన టీడీపీని విడిచిపెట్టి బీజేపీలోకి వెళ్లారు. ఆయన వైసీపీ నుంచి కేసుల వేధింపులు తట్టుకోలేకనే అలా చేశారని అంటారు.
ఎన్నికల ముందర టీడీపీలోకి చేరి టికెట్ తీసుకోవాలని ఆయన ప్లాన్ గా చెబుతారు. అయితే టీడీపీ మాత్రం వరదపురం సూరి వెళ్ళిపోగానానే ధర్మవరం బాధ్యతలను పరిటాల శ్రీరామ్ కి అప్పగించింది. ఆయన అక్కడ తనదైన శైలిలో దున్నేస్తున్నారు. పరిటాల ఫ్యామిలీకి ఓటు బ్యాంక్ కొంత ఉంది. దానికి తోడు ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని చూస్తున్నారు.
తాజాగా లోకేష్ పాదయాత్ర సందర్భంగా పరిటాల శ్రీరామ్ కి టికెట్ ఇస్తున్నాట్లుగా ప్రకటించారు. దాంతో ధర్మవరంలో వరదాపురం సూరి వర్గం డీలా పడినట్లు అయింది. సూరి మళ్ళీ టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తారు అని వారు భావించారు. అలాగే అంతా జరుగుతుంది అనుకుంటే చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీరామ్ నే అభ్యర్ధి అని లోకేష్ ప్రకటించారు.
ఇదిలా ఉండగా వరదాపురం సూరి ఇపుడు ఏమి చేస్తారు అన్నదే చర్చగా ఉంది. సూరికి కూడా సొంతంగ ఇమేజ్ బలం ఉన్నాయి. ఆన 2009లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తేనే 42 వేల ఓట్లు తెచ్చుకున్నారు. దాంతో ఆయన మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అన్న చర్చ సాగుతోంది. ఆయన కనుక అలా బరిలోకి దిగితే మాత్రం అది కచ్చితంగా పరిటాల శ్రీరామ్ గెలుపు మీద ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు.
వైసీపీకి సొంత ఓటు బ్యాంక్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్దికి బలం ఉన్నాయి. వరదాపురం సూరి కనుక షాకింగ్ డెసిషన్ తీసుకుంటే మాత్రం అది టీడీపీ విజయావకాశాలనే దెబ్బ తీస్తుందని ఫలితంగా వైసీపీకి ప్లస్ అవుతుందని అంటున్నారు. దాంతో వరదాపురం సూరి వర్సెస్ పరిటాల శ్రీరాం ఎపిసోడ్ లో ధర్మవరం టీడీపీ విజయం నలుగుతోంది అంటున్నారు.
నిజానికి వరదాపురం సూరి పార్టీని వదిలేసి వెళ్లకుండా ఉంటే ఆయనకే టికెట్ అన్నది అందరికీ తెలిసిందే. ఆయన డైనమిక్ లీడర్ గా అక్కడ ఉన్నారు. కానీ బీజేపీలోకి వెళ్ళడంతోనే ఆయనకు మైనస్ అయింది అని అంటున్నారు. చంద్రబాబు సైతం కీలకమైన సీటు పైగా పరిటాల కుటుంబం మీద ఉన్న నమ్మకంతో ముందే ప్రకటించేశారు అని అంటున్నారు. ఇపుడు వరదాపురం సూరిని దారికి తీసుకుని రావడం మీదనే టీడీపీ పెద్దల దృష్టి ఉందని అంటున్నారు.
బీజేపీతో పొత్తులు కుదిరితే సూరి సైలెంట్ గా ఉంటారా లేక ఇండిపెండెంట్ గా రంగంలో ఉంటారా అన్నది తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక పరిటాల శ్రీరామ్ సూరిల మధ్య సైతం మాటల ఇండైరెక్ట్ వార్ టికెట్ కోసం నడచింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని సూరి కనుక రివర్స్ అయితే కేతిరెడ్డి మరోసారి ధర్మవరంలో జెండా ఎగరేయడం ఖాయమని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.