ప్రేమ పక్షుల్లాగా కనిపిస్తున్న వీరిని చూశారా.. తన భర్తకు ఎంతో అనురాగంతో ముద్దు పెడుతోంది ఓ బామ్మ. తమ జీవితానుభవంలో ఎన్నో కష్టాలు, సుఖాలు చూసి ఉంటారు కావచ్చు. కానీ కలిసిమెలిసి మాత్రం జీవించగలిగారు. అందుకే 84 ఏళ్లపాటు కలిసున్నారు. ఇటీవల వీరు తమ 85వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భర్తకు, ఆ భార్య ఎంతో ప్రేమకొద్ది ముద్దుపెడుతున్న దృశ్యాన్ని ఒకరు తమ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది వైరల్ గా మారుతోంది.
నేటి కాలంలోని భార్యభర్తలు చిన్న మనస్పర్థల కారణంగా క్షణంలో విడిపోతున్నారు. ఎంతో ఆర్భాటంగా పెళ్లిళ్లు చేసుకుంటూ.. ఒక్కరోజులోనే ఆ పెళ్లి పెటాకులు చేసుకుంటున్నారు. తాము ప్రేమించుకున్నాం.. జీవితాంతం కలిసుంటాం.. అన్నప్రేమికులు సైతం ఒకరిపై ఒకరు ఇగో ప్రాబ్లంతో వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. ‘నువ్వు లేకపోతే నేను లేను’.. అనేవాళ్లే ‘నువ్వు లేకపోతే ఎంతో హాయిగా ఉంది..’ అని అంటున్నారు. దీంతో భార్యభర్తల బంధంపై నమ్మకం సన్నగిల్లుతోంది.
అయితే పూర్వ కాలంలో భార్యభర్తల మధ్య ఎంతో ప్రేమ ఉండేది. ఒకరి మొహం ఒకరు చూడకున్నా పెద్దల అంగీకారంతో పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాంటి వారు తమ జీవిత ప్రయాణంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకునేవారు. ఒకరి కష్టాలను మరొకరు తెలుసుకుంటూ వారికి సాయపడేవారు. అలాగే ఒకరు చేసిన తప్పులను మరొకరు మన్నించేవారు. ఇలా ఇద్దరు కలిసి తమ జీవితాన్ని హాయిగా సాగించేవారు. భార్యభర్తలు తమ ఇగోలను పక్కన బెట్టి వారి లోపాలను, తప్పులను సరిదిద్దుకుంటూ జీవితంలో ఎన్నో సంతోషాలను పొందవచ్చని కొందరు నిపుణులు అంటారు.
అలాగే కేరళకు చెందిన ఈ దంపతులు 1936లో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం జరిగి 84 ఏళ్లు అవుతున్నా వారి మధ్య ప్రేమ తగ్గలేదనడానికి ఈ ఫొటోనే నిదర్శనం. జీవితంలో వీరిద్దరు ఎన్నో కష్టాలు పడొచ్చు.. తప్పులు చేయొచ్చు.. ఒకరరినొకరు తిట్టుకోవచ్చు.. కానీ అది తమ వ్యక్తిత్వాలను తెలిసేవరకేనన్న విషయం అర్థమవుతోంది. ఆ తరువాత వారు ఒకరినొకరు గౌరవించుకొని తమ జీవితాన్ని సాగించినట్లు తెలుస్తోంది. 102 ఏళ్లు ఉన్నా ఆ పెద్దాయన, 101 ఏజ్ వచ్చిన ఆమె మధ్య ఉన్న ఈ బంధం ప్రతీ జంటకు ఆదర్శంగా నిలుస్తోంది.