కండకావరం; మోడీకి పాక్ నటి వార్నింగ్

Update: 2016-02-24 16:21 GMT
పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగించే సెలబ్రిటీలు కొందరు ఉంటారు. నిజానికి వారికి అంత సీన్ లేకున్నా.. అవసరానికి మించిన హడావుడి చేసే బాపతులోకి చెందే పాక్ నటి వేసిన వేషాలపై భారతీయులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అవసరం లేకున్నా.. అవాకులు చవాకులు పేలుస్తూ ఒక వీడియోను రూపొందించిన ఆమె.. ప్రధాని మోడీని టార్గెట్ చేయటం ద్వారా పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు ఉంది.

తాజాగా పాక్ టీవీ నటి ఖండీల్ బలోచ్ ఒక చౌకబారు ప్రయత్నానికి తెర తీసింది. ప్రధాని మోడీని ఛాయ్ వాలాగా సంబోధించిన ఆమె.. పాక్ కు మోడీ భయపడుతూ ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. పాక్ కు కానీ కోపం వస్తే మోడీ అడ్రస్ గల్లంతు అవుతుందని మాటలతో తెగ బడింది. ఈ అమ్మడి కండకావరంపై భారతీయులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News