అనుభ‌వంతో చేసి ఉంటార్లే ప‌వ‌న్‌?

Update: 2018-11-03 10:44 GMT
కొంత‌మంది తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. అంద‌రూ చెప్పినా.. హెచ్చ‌రించినా పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఇలాంటి వారు త‌మ‌కు తాముగా న‌ష్ట‌పోయినా.. త‌మ అనుభ‌వ‌పూర్వ‌కంగా తెలుసుకుంటే త‌ప్పించి ఎవ‌రి మాట విన‌ని ప‌రిస్థితి. అందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.

2014 ఎన్నిక‌ల వేళ బాబుతో క‌లిసి న‌డిచేందుకు సిద్ధ‌మైన వేళ‌.. ఆయ‌నలోని త‌ప్పుల గురించి.. లోపాల‌పైనా ప‌లువురు త‌ప్ప ప‌ట్టినా.. విమ‌ర్శించినా పెద్ద‌గా ప‌ట్టించుకోని ప‌వ‌న్ కు ఇప్పుడు మాత్రం అందుకు భిన్న‌మైన దృశ్యాన్నిత‌న‌కు తాను చూసిన‌ట్లుగా చెబుతున్నారు. అవ‌కాశవాదానికి కేరాఫ్ అడ్ర‌స్ గా బాబు నిలుస్తార‌న్న మాట ప‌లువురు నోట వినిపించేది.

అదేమ‌న్నా అంటే.. అనుభ‌వ‌శీలి.. ముఖ్య‌మంత్రిగా తొమ్మిదిన్న‌రేళ్లు పాలించిన వ్య‌క్తికి తెలీని అంశాలు ఏముంటాయ‌ని క‌వ‌ర్ చేసిన క‌ల్యాణ్.. ఈ రోజు మాత్రం ఆయ‌న‌పై నోరు పారేసుకుంటున్నారు. టీడీపీ.. కాంగ్రెస్ మైత్రి సంబంధంపైన ప‌వ‌ర్ క‌ల్యాణ్ ఫేస్ బుక్ ఖాతాలో ప‌లు పోస్టులు చేశారు.

ఒక‌ప్పుడు తిట్లు తిట్టుకున్న నేత‌లు ఇప్పుడు ఒక‌టి కావ‌టం అవ‌కాశవాదం కాక మ‌రేమిటి? అని ప్ర‌శ్నించారు. బాబు తాను రాష్ట్ర సీఎం అన్న విష‌యాన్ని మ‌రిచారంటూ త‌ప్పు పట్టారు. తెలుగువారి ఆత్మ‌గౌర‌వం తాక‌ట్టు పెట్టారంటూ ఘాటుగా విమ‌ర్శించారు. అసంబ‌ద్ధంగా జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌న‌కు కాంగ్రెస్‌.. బీజేపీలు రెండూ కార‌ణ‌మేన‌న్న ప‌వ‌న్‌.. హైద‌రాబాద్ నుంచి మ‌న‌ల్ని గెంటేయ‌టంలో రెండు పార్టీల‌ది కీల‌క‌మ‌న్నారు.

ఏపీలో అనుభ‌వం ఉన్న నాయ‌కులు ఈ ఇష్యూలో సిగ్గుప‌డాల‌న్నారు. నాలుగేళ్ల పాటు అనుభ‌వం.. అనుభ‌వం అంటూ బాబును వెన‌కేసుకొచ్చిన ప‌వ‌న్‌.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా బాబుపై ఫైర్ కావ‌టం గ‌మ‌నార్హం. బాబులో త‌ప్పులు ఎత్తి చూపుతున్న ప‌వ‌న్‌.. గ‌తంలో ఇదే విష‌యాన్ని చెప్పిన‌ప్పుడు ఎందుకు వినిపించుకోలేద‌న్న ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ స‌మాధానం చెబితే బాగుంటుంది.


Tags:    

Similar News