హెచ్చరిక: ఏపీకి పొంచి ఉన్న ప్రమాదం

Update: 2020-04-25 06:50 GMT
కరోనా వేళ ఏపీకి అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. ఓవైపు కరోనా తీవ్రత తగ్గకపోగా.. దాన్ని మరింత పెంచేలా మరో విపత్తు వస్తోంది. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడి బలపడుతుందని వాతావరణ శాఖ బాంబు పేల్చింది. దీని ప్రభావంతో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు కోస్తా + రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు - పిడుగులు - వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

ఇక వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాయలసీమ లో పలుచోట్ల కురిశాయి. తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఇవన్నీ చెడగొట్టు వానలు. కోతకు వచ్చిన వరి - ఇతర పంటలను వడగళ్లతో నాశనం చేస్తాయి. పిడుగులతో పశువులు - రైతుల ప్రాణాలు తీస్తాయి.

ఇక శనివారం నుంచి ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాతావరణంలో తేమ - శీతల వాతావరణం ఉంటే మరింతగా కరోనా వ్యాపిస్తుంది. ఎండలకే ఇంత విస్తరిస్తుంటే.. ఇక వానలు కొడితే  ఇది చాలా డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక వ్యవసాయ పనులు చేసే రైతులు వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Tags:    

Similar News