రాష్ట్ర విభజన చేస్తే చాలు.. అధికారం తమదేనని ఫీలైన కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు షాకిస్తే.. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తెలంగాణ అధికారపక్షంగా మారిన టీఆర్ఎస్ షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. అరకొర మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అధినేతకు బలమైన విపక్షాల తాకిడికి చుక్కలు కనిపిస్తాయన్న వాదన వినిపించింది. దీనికి భిన్నంగా విపక్షాల్ని తన దారికి ఎలా తెచ్చుకున్నారో తెలిసిందే.
టీఆర్ఎస్ అన్నా.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నా తీవ్రంగా మండిపడే ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా టీఆర్ఎస్ లోకి చేరేందుకు సిద్ధం కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు గాలం వేసేందుకు టీఆర్ఎస్ నేతలు పలుమార్లు ప్రయత్నించినా.. గుత్తా సానుకూలంగా స్పందించలేదని చెబుతారు. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి చోటు చేసుకుంది.
గుత్తాకు బంధువైన ఒక ప్రముఖ కాంట్రాక్టర్ కు చెందిన సంస్థకు తెలంగాణలో పలు కాంట్రాక్టులు దక్కాయి. అవన్నీ ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు సాగాలంటే.. గుత్తా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోక తప్పని పరిస్థితన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే.. ఇలాంటి వాటికి గుత్తా లొంగే రకం కాదన్న మాట ఆయన గురించిన పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గుత్తా కారు ఎక్కాలన్న నిర్ణయం వెనుక అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ కు మంచిరోజులు లేవన్న విషయం తేలిపోవటం.. సమర్థ నాయకత్వ లేమి పార్టీని వెంటాడుతున్న నేపథ్యంలో ‘కారు’ ఎక్కటానికి మించిన మంచి పని లేదన్న సూచనతోనే గుత్తా తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణలో జెయింట్ గా మారిన కేసీఆర్ ను ఎదుర్కొని నిలిచి ప్రజల మనసుల్ని దోచుకునే నాయకుడు ఎవరూ కనిపించని నేపథ్యంలో కాంగ్రెస్ దుకాణం నుంచి బయటకు రావాలన్న నిర్ణయానికి గుత్తా వచ్చినట్లుగా తెలుస్తోంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. తెలంగాణలోని పది జిల్లాల్లో నల్గొండ మినహా మిగిలిన జిల్లాల్లో టీఆర్ఎస్ బలంగా ఉంది. తెలంగాణ అధికారపక్షాన్ని ఇబ్బంది పెట్టే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఉందంటే అది నల్గొండ జిల్లాలోనే అని చెప్పక తప్పదు.
ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు గుత్తా మీద టీఆర్ఎస్ అధినాయకత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో టీఆర్ఎస్ బలపడేందుకు బలమైన క్యాడర్ ఉన్న ఈ నేతల్ని కారు ఎక్కించటం ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ కు ఎదురులేదన్నట్లుగా తయారు చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెప్పొచ్చు.
ఇక.. గుత్తా వెర్షన్ కి వస్తే.. టీఆర్ఎస్ కు సంబంధించి నల్గొండలో నేతలు ఉన్నా.. తమలాంటి బలమైన నేతలు లేని కొరత ఉన్న నేపథ్యంలో.. అధికారపక్షం నుంచి ఆహ్వానం వచ్చిన వేళ ‘కారు’ ఎక్కేస్తే సముచిత గౌరవం దక్కుతుందన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. తనను నమ్మి వచ్చిన నేతలకు మర్యాదగా చూసుకోవటంతో పాటు.. జాయినింగ్ సమయంలో ఇచ్చిన హామీల్ని తదనంతర కాలంలో నిలబెట్టుకునే విషయంలో కేసీఆర్ కరెక్ట్ గా ఉన్న నేపథ్యంలో.. పార్టీ మారేందుకు ఇదే సరైన సమయంగా గుత్తా భావిస్తున్నట్లు చెబుతున్నారు.
టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే బలమైన నేతలు.. క్యాడర్ నల్గొండ జిల్లాలోనే ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్.. గుత్తా లాంటి వారిని కారు ఎక్కించటం ద్వారా నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతం కావాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. జిల్లా నుంచి బలమైన నాయకత్వం లేని నేపథ్యంలో.. ముందుగా పార్టీలోకి వచ్చిన వారికిచ్చే ప్రాధాన్యత వేరన్న సంగతి తెలిసిందే. అందుకే.. పార్టీ మారే విషయంలో ఎప్పుడో నిర్ణయం తీసుకునే కన్నా.. ఇదే సరైన సమయంగా గుత్తా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ తో ఒకదశ చర్చలు ముగిసి.. మలి విడత చర్చలు హరీశ్ తో పూర్తి అయిన నేపథ్యంలో ఆయన కారు ఎక్కటం ఖాయమని చెబుతున్నారు.