పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీల్ని పెద్ద ఎత్తున చేపట్టాలని మోడీ సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు కార్యక్రమాల్ని చేపట్టిన కేంద్రం.. ఇటీవల ‘బీమ్’ పేరిట ఒక యాప్ ను విడుదల చేసింది. నగదు రహిత లావాదేవీల్ని చాలా సింఫుల్ గా..గ్రామీణులు చేసుకునేందుకు వీలుగా తయారు చేసిన ఈ యాప్ కు ‘బీమ్’ పేరు పెట్టటం ఎందుకన్నది పలువురికి సందేహం కలిగింది.
అయితే.. ఈ యాప్ కు భీమ్ పేరు పెట్టటం వెనుక యూపీ రాజకీయమేనన్న విషయం తాజాగా మోడీ చేసిన ప్రసంగాన్ని వింటే అసలు విషయం అర్థమవుతుందని చెప్పక తప్పదు. ఈ వారంలో ఏ క్షణంలో అయినా యూపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. నగదురహిత లావాదేవీలకు అనువుగా ఉంటుందని ఇటీవల విడుదల చేసిన భీమ్ యాప్ కు అంబేడ్కర్ పేరును పెట్టటం ద్వారా ఆయా వర్గాల దృష్టిని ఆకర్షించాలన్నదే మోడీ సర్కారు లక్ష్యంగా చెప్పక తప్పదు. ఈ విషయాన్ని లక్నోలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
తాము భీమ్ పేరిట యాప్ ను విడుదల చేశామని.. దానికి రాజ్యాంగ నిర్మాత.. ఆర్థికవేత్త అంబేడ్కర్ పేరు పెట్టామని.. భవిష్యత్ లావాదేవీలు అంబేడ్కర్ పేరుతో జరిగితే కొందరికి ఇబ్బంది కలుగుతోందన్నమోడీ వ్యాఖ్యను అండర్ లైన్ చేసుకుంటే ఇట్టే విషయం అర్థమవుతుంది. ప్రతి చోటా భీమ్ పేరు మారు మోగాలని.. అదే అంబేడ్కర్ కు అసలైన నివాళిగా చెప్పటం ద్వారా.. దళిత ఓట్లపై మోడీ సర్కారు గురి పెట్టి విడిచి బాణంగా ‘భీమ్ యాప్’ ను అభివర్ణిస్తే తప్పేం కాదేమో..? ఓపక్క కులాల్ని పట్టించుకోకుండా ఓట్లు వేయాలని అడుగుతున్న మోడీ.. మరోవైపు అదే పనిని తాను మాత్రం చేయొచ్చన్న రీతిలో మాట్లాడుతున్న మాటలు వింటే.. నీతులు చెప్పేందుకు మాత్రమేనన్న విషయం మరోసారి స్పష్టం అయినట్లేనని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/