సంపన్నులు.. సౌండ్ పార్టీలు.. వ్యాపార రంగానికి చెందిన వారు. కార్పొరేట్లు అయితే మరింత మంచిది అన్నట్లుగా ఉండేది టీడీపీ అధినేత చంద్రబాబు తీరు. నామినేటెడ్ పోస్టుల కేటాయింపు విషయంలో పార్టీ జెండా మోసిన వారి కంటే.. పార్టీకి ఫైనాన్స్ చేసే వారికే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందన్న చెడ్డపేరు ఉంది. దీనికి తగ్గట్లే పార్టీ అంటే ప్రాణం పెట్టే వారి కంటే.. పార్టీతో పనులు చేయించుకునే వారికే పెద్ద పీట వేసిన చంద్రబాబుకు జరగాల్సిన శాస్తి జరిగిందని చెప్పాలి.
వ్యాపారస్తుడికి ఉండే కమిట్ మెంట్ ఒక్కటే.. తన స్వప్రయోజనం. అంతేతప్పించి సిద్ధాంతాలు.. మన్ను మషానం అస్సలు ఉండదు. అవేమీ పట్టదు కూడా. ప్రజలతో నేరుగా సంబంధాలు లేని ఇలాంటి నేతల్ని నెత్తిన పెట్టుకున్న బాబుకు అసలు తత్త్వం బోధ పడే పరిణామాలు తాజాగా చోటు చేసుకున్నాయని చెప్పాలి.
విజన్ లోపించిన బాబుకు కళ్లు పత్తికాయల మీదిరి విచ్చుకునేలా చోటు చేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో బాబు ఆలోచనలో మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు. పార్టీ ఏపీ శాఖకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత కమ్ గ్యారేజీకి సిద్ధంగా ఉండే కళా వెంకట్రావు అనే పెద్దమనిషిని అధ్యక్షులవారిగా నియమించటం తెలిసిందే. విషయాలపై ఆయనకు అవగాహన ఉండొచ్చు.
కానీ.. వాటిని ప్రజెంట్ చేసే తీరు.. కింది స్థాయి నేతలు మొదలు కార్యకర్తల వరకూ ఉత్సాహాన్ని.. ఉత్తేజాన్ని రగిల్చే విషయంలో ఆయన ఎంతగా విఫలమయ్యారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. లేఖలు రాయటం మినహా ఆయన చేసిందేమీ లేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లో దారుణ పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని భావించిన చంద్రబాబు.. చాలా రోజుల తర్వాత పార్టీకి పనికి వచ్చే పని ఒకటి చేశారని చెప్పాలి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువనేత.. ఉత్సాహవంతుడు.. విషయం ఉన్న వాడు.. ప్రజాదరణ మొండుగా ఉన్న ఎంపీ రామ్మోహన్ నాయుడికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బీసీసామాజిక వర్గానికి చెందిన నేత చేతుల్లో ఏపీ శాఖను పెట్టటం ద్వారా.. ఆ వర్గానికి పెద్దపీట వేసినట్లు కావటంతో పాటు.. పార్టీలో కిందిస్థాయి వారిలోనూ కొత్త ఉత్సాహం పొంగిపొర్లుతుందన్న మాట వినిపిస్తోంది. రామ్మోహన్ అయిన లోకేశ్ కు సైతం కంఫర్ట్ గా ఉంటుందన్న ఉద్దేశంతో బాబు తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పక తప్పదు.