రాయలసీమ రాజకీయాల్లో కీలకనేత, టీడీపీ సీనియర్ నేత , మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అసలు జేసీ మాట్లాడే ప్రతి మాట కూడా ఆసక్తికరంగానే ఉంటాయనడం లో అతిశయోక్తిలేదు. రాజకీయాల్లో మాట్లాడటం లో అయన శైలే వేరు. విమర్శలు చేయడంలో కానీ , పొగడ్తలు కురిపించడంలో కానీ..తమ పార్టీ వారైనా, ఇతర పార్టీల వారిపైనైనా ఒకే రీతిలో కామెంట్స్ చేసే నేత. ఈయన తాజా రాజకీయాలపై పలు ఆసక్తికర కామెంట్స్ చేసాడు. దేశంలో రాజకీయాలు కలుషితం అయ్యాయని.. అభివృద్ధి చూసి ప్రజలు ఓటు వేస్తారనుకుంటే పొరపాటే అని అన్నాడు. ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని.. వాళ్లే ఓట్లు వేయిస్తున్నారని ఆరోపణలు చేశాడు.
అభివృద్ధి చూసి వైఎస్సార్ సీపీ కి ఓటేశారని చెప్పడం అబద్ధమన్నారు. అదంతా దొంగ మాట అన్నారు. డబ్బులు లేనిదే ఎన్నికల్లో ఎవరూ గెలవలేరని, డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో గెలుపొందుతున్నారని అన్నారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని, అయినా వైఎస్సార్ సీపీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారన్నారు జేసీ. ఆలా అయితే టీడీపీ గెలిచిన చోట డబ్బులు వెదజల్లి గెలిచినట్టేగా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.
అలాగే ఏపీ సీఎం జగన్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రోజు ఆదాయం రూ. 300 కోట్లని ఇది ఎంతవరకు నిజమో ?అబద్ధమో? తెలియదు కానీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది అని అన్నారు. తెలంగాణ పెద్దపల్లిలో జరిగిన అడ్వకేట్ దంపతుల హత్యపై దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలో అన్ని ఆధారాలు ఉన్నా విచారణ ఎందుకని ప్రశ్నించారు.