ఆహా! ఇది కదా మ్యాచ్ అంటే అని క్రికెట్ అభిమానులు చెప్పుకునేలా ఐపీఎల్లో పంజాబ్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. పంజాబ్ పంజా విసిరి ఏకంగా నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులు చేస్తే.. రాజస్థాన్ బ్యాట్స్ మెన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మూడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకున్నారు. పంజాబ్ బ్యాట్స్ మెన్ రాజస్థాన్ బౌలర్లను ఊచ కోత కోస్తూ బాల్ వేస్తే చాలు బౌండరే అన్నట్టుగా బాదితే..దానికి బదులుగా రాజస్థాన్ బ్యాట్స్ మెన్ సిక్సర్ల జాతర చేశారు. ఐపీఎల్ చరిత్రలోనే బ్యాటు బ్యాటుకు మధ్య జరిగిన సమరంలా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగుల భారీస్కోరు చేసింది. మయాంక్ అగర్వాల్ (50 బంతుల్లో 106; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సూపర్ సెంచరీ సాధించాడు. కెప్టెన్ కే ఎల్ రాహుల్ మరో సారి అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. (54 బంతుల్లో 69; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేశాడు. పూరన్ కూడా (8 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లతో) రాణించడంతో జట్టు స్కోరు 223కు చేరింది. భారీ ఛేదనకు దిగిన రాజస్థాన్ జట్టు ఓపెనర్ స్టీవ్ స్మిత్ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచి ఆరంభం ఇవ్వగా..మొదటి మ్యాచ్ లాగా సంజూ శాంసన్ మరో సారి కుమ్మేశాడు.
ఏకంగా 42 బంతుల్లోనే 85(4 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులు చేసి జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. స్మిత్, శాంసన్ భారీ స్కోరు సాధించినా మ్యాచ్ మలుపు తిప్పింది మాత్రం రాహుల్ తేవటియానే అతడు చివర్లో ఎవరూ ఊహించని విధంగా 31 బంతుల్లో 53; 7 సిక్సర్లతో సంచలన బ్యాటింగ్ చేసి మూడు బాల్స్ మిగిలించి విజయం అందించాడు.
మ్యాచ్ అసలు హీరో పూరన్
బ్యాట్స్ మెన్ల మ్యాచ్ గా సాగిన ఆటలో పూరన్ తన ఫీల్డింగ్ తో అందరినీ మాయచేశాడు. మరో సారి జాంటీ రోడ్స్ ని తలపించాడు. మురుగన్ అశ్విన్ 8వ ఓవర్ మూడో బంతిని శాంసన్ పుల్ చేయగా అది డీప్ మిడ్ వికెట్ లో సిక్సర్ ఖాయం అనుకున్నారు. కానీ పూరన్ బౌండరీలైన్ వెలుపల సెకనుతో పోటీపడి మరీ బంతి క్యాచ్ పట్టాడు. ఎడంచేత్తో మైదానం లోకి విసిరాడు. ఇదంతా క్షణకాలంలోనే జరిగిపోయింది. రీప్లేలో అతడి ఫీల్డింగ్ విన్యాసం చూసి అంతా షాక్ అయ్యారు. సచిన్ టెండూల్కర్ పూరన్ మెరుపు విన్యాసాన్ని పొగుడుతూ ట్వీట్ చేశారు. పూరన్ క్యాచ్ పట్టిన వీడియో వైరల్ గా మారింది.
తెవాతియా.. ఒక్క ఓవర్..5 సిక్సర్లు
ఈ మ్యాచ్ మలుపు తిప్పింది. తెవాతియానే. ముందు క్రీజులో బ్యాటింగ్ చేసేందుకు బాగా ఇబ్బంది పడ్డ అతడు. 18 వ ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కాట్రెల్ వేసిన 18వ ఓవర్‌లో ఐదు సిక్స్‌లు బాదడం తో మ్యాచ్ విజయానికి చేరువైంది.
మ్యాచ్ లో మరిన్ని హైలైట్స్
* ఈ మ్యాచ్ లో మయాంక్ సూపర్ సెంచరీ చేశాడు. అది ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెకండ్ సెంచరీ. అతడు 45 బంతుల్లో 100 పరుగులు చేశాడు. యూసుఫ్ పఠాన్ 37 బాల్స్ కే సెంచరీ కొట్టి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.
* పంజాబ్ ఇన్నింగ్స్ లో 16 ఓవర్ల పాటు వరుసగా 31 సార్లు బంతి సిక్స్ లేదంటే ఫోర్‌గా రేఖ దాటింది.
* ఐపీఎల్ చరిత్రలో 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఇదే మొదటి సారి. మ్యాచ్ లో మొత్తం పరుగులు నమోదయ్యాయి.
* రాజస్థాన్ కు ఇది వరుసగా రెండో విజయం. అంతకు ముందు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో కూడా రాజస్థాన్ భారీ స్కోరు చేసి విజయం అందుకుంది.
* భారీ స్కోర్ ఛేదన రికార్డు గతంలో రాజస్థాన్ పేరిట ఉండగా.. తమ రికార్డును తామే తిరగరాశారు. 2008లో (ఐపీఎల్ తొలి సీజన్ లో) దక్కన్ చార్జర్స్ జట్టు 215 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ కు నిర్ధేశించింది. 7 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ 217 పరుగులు చేసి అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 12 ఏళ్ల తర్వాత, ఐపీఎల్ 2020లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తమ అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డు ను అధిగమించారు.