రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో సత్తా చాటాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై వారు దృష్టిసారించారు. తాజాగా వారిలో నవోత్సాహాన్ని నింపుతూ.. విజయనగరం రాచ కుటుంబం వారసురాలు సంచయిత గజపతిరాజు బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ - కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి - ఎంపీ కంభంపాటి హరిబాబు - ఇతర నేతల సమక్షంలో సంచయిత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
విజయనగరంతోపాటు చుట్టుపక్కల రెండు-మూడు జిల్లాల్లో గజపతి రాజుల కుటుంబానికి ఎంతో పేరుంది. అలాంటి కుటుంబం వారసురాలు తమతో చేయి కలపడంతో బీజేపీ ఆనందంలో మునిగి తేలుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచయిత కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేస్తోంది.
సంచయిత.. మాజీ మంత్రి ఆనంద్ గజపతి రాజు - మాజీ ఎంపీ ఉమా గజపతి రాజు దంపతుల కుమార్తె. ఆనంద్ గజపతి రాజు కూడా గతంలో ఎంపీగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కేబినెట్ లో ఆయన మంత్రిగా పనిచేశారు. కొన్నాళ్లపాటు కాంగ్రెస్ లోనూ ఉన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు - కేంద్ర పౌర విమానయానశాఖ మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు ఆనంద్ స్వయానా అన్నయ్య. అశోక్ గజపతి రాజు కొన్నాళ్లు జనతా పార్టీలో ఉన్నారు. ఆపై టీడీపీలో చేరారు. అయితే, గజపతి రాజుల కుటుంబం నుంచి బీజేపీలో చేరిన తొలి వ్యక్తి మాత్రం సంచయితే.
సోషల్ అవేర్ నెస్ న్యూయర్ ఆల్టర్నేటివ్స్(ఎస్ ఏఎన్ ఏ) పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను సంచయిత ప్రస్తుతం నడిపిస్తున్నారు. కోస్తా గ్రామాల్లో ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించడంలో కొత్త సాంకేతికతలు చేకూర్చే లబ్ధిపై ఈ సంస్థ అవగాహన కల్పిస్తుంటుంది. ప్రధానంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో సంచయిత సంస్థ చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆమె రాకతో మరింతమంది యువనేతలు తమ పార్టీలో చేరే అవకాశముందని కమలనాథులు అంచనా వేస్తున్నారు.