రిసార్ట్ లో అంబులెన్స్ ను అందుకే తెప్పించారా?

Update: 2017-02-14 04:35 GMT
తమిళనాడు రాజకీయ సంక్షోభంలో మహాబలిపురం దగ్గర్లోని గోల్డెన్ బే రిసార్ట్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. మీడియా మొత్తం అక్కడే కాపుకాసుకొని ఉంది. తమిళనాడు ఫ్యూచర్ రాజకీయాలు ఈ రిసార్ట్ తో ముడిపడి ఉండటంతో.. ఇక్కడ జరిగే పరిణామాలపై అందరూ ఒక కన్నేసి ఉంచుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రిసార్ట్ కు నిన్న మధ్యాహ్నం వేళ.. ఒక అంబులెన్స్ రావటం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో కాస్తంత ఆందోళన కూడా గురి చేసింది.

అంబులెన్స్ వచ్చిన వెంటనే.. కొన్ని ఊహాగాను బలంగా వినిపించాయి. రిసార్ట్ లోని కొంతమంది ఎమ్మెల్యేలకు వాంతులు అయ్యాయని.. వారికి తక్షణ వైద్యం కోసం ఒక వైద్యుల బృందాన్ని తెచ్చినట్లుగా చెప్పుకున్నారు. అయితే.. అందులోనిజం లేదన్న మాట వినిపించింది. ఎందుకంటే.. ఎమ్మెల్యేలు కానీ అనారోగ్యానికి గురైతే.. వెంటనే వారికి వైద్య సాయం అందించటానికి జరిగే హడావుడి ఒక రేంజ్లో ఉండేదని.. వచ్చిన అంబులెన్స్ రిసార్ట్ లోనే ఉండిపోవటంతో.. ముందస్తు జాగ్రత్త కోసమే తెచ్చినట్లుగా వాదనలు వినిపించాయి.

ఇదిలాఉంటే.. ఈ అంబులెన్స్ మీద కొన్ని జోకులు కూడా వినిపించటం విశేషం. నిన్న రాత్రి రిసార్ట్ కు వచ్చిన చిన్నమ్మ తిరిగి వెళ్లకపోవటం.. సుప్రీం తీర్పు చెప్పిన వెంటనే.. ఆమెకు గుండె నొప్పి వస్తుందని.. ఆసుపత్రికి తీసుకెళ్లటానికి అంబులెన్స్ అవసరం అవుతుంది కాబట్టి.. (అరెస్ట్ కాకుండా ఉండేందుకన్న అర్థంలో)అందుకే తెప్పించినట్లుగా వ్యాఖ్యానించటం కనిపించింది. ఏమైనా.. రిసార్ట్ కు వచ్చిన అంబులెన్స్ అందరిలోనూ హాట్ టాపిక్ గా మారింది. అందరిలో తలెత్తే ప్రశ్నలకు మాత్రం ఎవరికీ సమాధానాలు దొరకలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News