టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం నుంచి సానుకూల పవనాలు వీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్ల కిందట.. అసలు చంద్రబాబును పట్టించుకోలేదు. ఆయన ఢిల్లీకి వెళ్లినా.. ఎవరూ ఆయన మొ హం చూడలేదు. ఇలాంటి పరిస్థితి నుంచి.. ఇప్పుడు ఆయన కోరగానే భద్రత పెంచడం.. ఆయనతో నేరుగా ప్రధాని నరేంద్ర మోడీనే భేటీ కావడం వంటి పరిణామాలు ఆశ్చర్యంగానూ.. ఆసక్తిగానూ మారాయి. అయితే.. ఈ పరిణామాలే.. ఇప్పుడు.. వైసీపీలో గుబులు రేపుతున్నాయి.
రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ కలిసి ముందుకు సాగితే.. తమకు ఇబ్బందని.. వైసీపీ ఎప్పటి నుంచో భావిస్తోంది. ఈ క్రమంలో గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాను తెరమీదికి తెచ్చి.. టీడీపీని వ్యూహాత్మకంగా బీజేపీ నుంచి తప్పించిందని..టీడీపీ నాయకులు పదేపదే చెబుతున్నారు. ఆ తర్వాత.. కూడా.. ఢిల్లీలో వ్యూహాత్మకంగా చక్రాలు తిప్పి.. బీజేపీని తమవైపు తిప్పుకుందని వారు అంటున్న విషయం తెలిసిందే. అయితే.. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. అనూహ్యంగా టీడీపీ వైపు బీజేపీ చూస్తోంది.
ఈ క్రమంలోనే మోడీతో చంద్రబాబు చర్చలు జరిపారు. తరచుగా వస్తుండాలని ఆయన కూడా బాబుకు సూచించారు. ఆ తర్వాత జరిగిన రికార్డు స్థాయి పరిణామం.. కుప్పంలో ఘర్షణలు జరుగుతున్న సమయం లోనే.. చంద్రబాబుకు కేంద్రం నుంచి భద్రత పెంచుతూ.. ఉత్తర్వులు వచ్చాయి. ఏకంగా.. 24 మందిని పెంచుతూ.. కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో చంద్రబాబు బలం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ పరిణామాలు.. టీడీపీలో జోష్ నింపుతున్నాయి.
అదే సమయంలో వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతర్గత సమావేశాల్లోనూ.. నాయకులు దీనిపై చర్చి స్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని..చెబుతున్న సమయంలో.. ఇప్పుడు చంద్ర బాబు కు భద్రత పెంచడం.. ద్వారా.. కేంద్రం.. రాష్ట్ర పరిస్థితిపై నెగిటివ్ థింకింగ్ చేస్తుందా? అనే ఆలోచ న చేస్తున్నారు. అదేసమయంలో తాము చంద్రబాబును తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నామని, రాజకీయంగా ఆయనను ఇక్కట్లకు గురి చేస్తున్నామనే సందేశం.. ప్రజల్లోకి వెళ్తే.. అది సింపతీగా మారుతుందని కూడా పార్టీ అధిష్టానం.. చర్చిస్తున్నట్టు సమాచారం. దీంతో కొన్నాళ్లపాటు టీడీపీపై విమర్శల పర్వాన్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.