పుల్లెల గోపీచంద్ ఆన్ లైన్ కోచింగ్..స్క్రీన్ పై అశ్లీల చిత్రాలు ప్రత్యక్షం!
కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో చాలా దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రపంచం స్థంభించిపోయింది. ఈ లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రపంచం స్థంభించిపోయింది. స్కూల్ కాలేజీలతో పాటు, అన్నిరకాల కోచింగ్ సెంటర్లు మూసివేయడంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.
దీనితో కి కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు భారత బ్యాడ్మింటన్ సంఘం కూడా ఆన్ లైన్ కోచింగ్ సెషన్ నిర్వహిస్తోంది. దీంట్లో దేశ వ్యాప్తంగా 700 మందికి పైగా కోచ్‌లు పాల్గొని శ్రద్ధగా సూచనలు వింటున్నారు. వీరందరికీ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఇండోనేసియా కోచ్‌లు అగుస్ దివి సాంటోసో, నమ్రి సురోటో దిశ నిర్దేశం చేస్తున్నారు. అంతా బాగానే సాగుతున్న వేళ, ఒక్కసారిగా స్క్రీన్ పై అశ్లీల చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో కోచ్ సాంటోసో క్లాస్ చెబుతున్నాడు.
ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. సెషన్ లో తరచుగా అలాంటి చిత్రాలే వస్తుండడంతో లైవ్ లో ఉన్న గోపీచంద్ వెంటనే లాగౌట్ అయ్యాడు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సెషన్ లో మహిళా కోచ్ లు కూడా ఉన్నారని, ఇది చాలా ఇబ్బంది కలిగించిందని అందులో పాల్గొన్న ఓ కోచ్ తెలిపారు. కరోనా కారణంగా 21 రోజుల పాటు బాయ్, సాయ్ ఈ ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వాడొద్దని సూచించిన ‘జూమ్’ వీడియో కాల్ యాప్ నే వీరూ ఆన్ లైన్ క్లాసుల కోసం వినియోగిస్తున్నారు. అయితే తమ ఆన్ లైన్ సెషన్ హ్యాక్ కాలేదని సాయ్ తెలిపింది. దీనిపై సాయ్ ఐటీ డిపార్ట్ మెంట్ విచారణ చేస్తోంది.