తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చేశారు. దీంతో, తలైవాపై రాజకీయ విమర్శల పర్వం మొదలైంది. రజనీ స్థానికుడు కాదని.....ఒక స్థానికేతరుడికి తమిళులు మద్దతు తెలపరని....ప్రముఖ దర్శకుడు భారతీ రాజా షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్....రజనీ పై మండిపడ్డారు. రజనీ సందర్భవాద రాజకీయాలు చేస్తున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీ అధినేత అయిన శరత్ కుమార్ మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటివరకు రజనీపై ఎటువంటి వ్యాఖ్యలు చేయని వారు కూడా ఆయన రాజకీయ అరంగేట్ర ప్రకటన వెలువడగానే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, నటి రాధిక భర్త - శరత్ కుమార్.....రజనీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ సందర్భవాద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రజనీ చూపించే గుర్తు బాబాది కాదని, అదొక మేక తలకాయని, అది కూడా ఓ సీక్రెట్ సోసైటీకి చెందిన సింబల్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. 1996లో జయలలితకు భయపడి విదేశాలకు పారిపోయిన రజనీ....ఆ తర్వాత కరుణానిధి సర్కార్ వచ్చాకే తమిళాడులో అడుగుపెట్టారని అన్నారు. అవకాశ వాద రాజకీయాలు చేయాలని రజనీ చూస్తున్నారని ఆరోపించారు. కావేరి జలవివాదంపై రజనీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తనపై శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై రజనీకాంత్ ఇప్పటివరకు స్పందించలేదు.