ఏపీ అసెంబ్లీ లో చంద్రబాబు కు షాక్

Update: 2019-12-09 05:11 GMT
గడిచిన ఐదేళ్లు సీఎంగా తన ఇష్టానుసారం ఏపీ అసెంబ్లీలో వ్యవహరించిన చంద్రబాబు ప్రతిపక్షంలోనూ అదే దూకుడుగా వెళ్లారు. కానీ వైసీపీ సర్కారు హయాం లో అలాంటి ఆటలు సాగడం లేదు. ఆయన ముందరి కాళ్లకు బంధాలు పడుతున్నాయి.

తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే ఉల్లి, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై వినూత్నంగా నిరసన తెలిపారు. వెంకటపాలెం లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు మెడలో ఉల్లిపాయ దండలతో ఫ్లకార్డులు పట్టుకొని అక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు.

అయితే ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. అసెంబ్లీ గేటు దగ్గర ఉల్లిపాయల దండలతో వస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను, చంద్రబాబును భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఉల్లిదండలు, ఫ్లకార్డులకు అనుమతి లేదని పోనీయలేదు. దీంతో పోలీసులకు, టీడీపీ ఎమ్మెల్యేలకు వాగ్వాదం జరిగింది.

చంద్రబాబు ఏపీ అసెంబ్లీ లో ఉల్లి, నిత్యావసర ధరల పెంపుతో పాటు దాదాపు 21 అంశాలను లేవనెత్తేందుకు రెడీ అయ్యారు. మరి దీని పై జగన్ సర్కారు ఎలాంటి అస్త్రశస్త్రాలను రెడీ చేస్తుందో చూడాలి.


Tags:    

Similar News