గే ప్రొఫెసర్ తో ఆ విద్యార్థులకు వింత సమస్యలు

Update: 2017-03-14 11:46 GMT
కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ గే చేష్టలు విద్యార్థులు భరించలేకపోయారు. తట్టుకోలేక ఆయనకు చెప్పి చూశారు. అయినప్పటికీ మార్పు లేకపోవడంతో కళాశాల యాజమాన్యం వద్దకు విషయం తీసుకుపోయారు. వారు సర్దిచెప్పినప్పటికీ  ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో సదరు సరసాల మాష్టారును ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఈ ఘటన బెంగళూరులోని సెయింట్ జోసఫ్ కాలేజీలో జరిగింది.

 ఈ కాలేజీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్న అష్లే టెల్లీస్‌ ను స్వలింగ సంపర్కుడు. ఆయన వల్ల తమ ఏకాగ్రతకు భంగం కలుగుతోందని విద్యార్థులు కళాశాలకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను ఉద్యోగంలోంచి తీసివేశారు. తన అభిప్రాయాలను విద్యార్థులపై బలవంతంగా రుద్దుతున్నాడన్న ఆరోపణలు వస్తున్నాయని కళాశాల పేర్కొంది. ఇతడు స్వలింగ సంపర్కుడే కాకుండా ఎన్‌ జీబీటీ హక్కుల ఉద్యమకారుడు కూడా కావడంతో ఆయనకు పలువురు మద్దతు ఇస్తున్నారు. ఆయన్ను తొలగించడం తప్పని వారు వాదిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News