కమల్.. పొలిటీషియన్ అని ఆయనే చెప్పుకోవాల్సి వస్తోంది

Update: 2018-01-28 17:12 GMT
కార్లు - బళ్లుపైన ప్రెస్ అని రాసి ఉంటుంది చూశారా... కొందరి వాహనాలపై డాక్టర్ అని - లాయర్ అని కనిపిస్తుంటాయి, ఆర్మీ అని రాసుకునేవారు కూడా ఉంటారు. కొన్ని ప్రొఫెషన్లవారు ఇలా తాము ఫలానా అని అందరికీ తెలిసేలా రాస్తుంటారు. ఎక్కడైనా వారి అవసరం ఉన్నప్పుడు సులభంగా గుర్తించి సంప్రదించడానికి వీలుగా అదో పద్ధతి పాటిస్తుంటారు. కానీ, పొలిటీషియన్ అని ఎవరైనా రాసుకోవడం ఎక్కడైనా చూశారా... కనీసం విజిటింగ్ కార్డులపై - నేమ్ బోర్డులపై కూడా ఏ రాజకీయ నాయకుడూ పొలిటీషియన్ అని రాసుకోరు - ఒకవేళ ఏవైనా పదవుల్లో ఉంటే ఆ పదవిని మెన్షన్ చేస్తారు కానీ పేరు కింద రాజకీయ నాయకుడని రాసుకోవడం మాత్రం ఉండదు. కానీ... కొత్తగా పొలిటీషియన్లవుతున్నవారు - తమను అంతా అలా గుర్తిస్తారో లేదో అని తమకు తామే పొలిటీషియన్ అని రాసుకుంటున్నారు. తాజాగా కమల్ హాసన్ సంతకం - దాని కింద పొలిటీషియన్ అని రాసి ఉన్న ఇమేజి ఒకటి సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది.
    
కమల్ వచ్చేనెల 21న తన పార్టీ పేరును ప్రకటిస్తానని - దాని విధి విధానాలను ప్రకటిస్తానని చెప్పారు విలక్షణ నటుడు. అంతేకాదు అందరికీ రోల్ మోడల్ గా నిలిచేందుకు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని మోడల్ విలేజ్ గా మారుస్తానని చెప్పారు. అంతేకాదు... కమల్ తనను తాను పొలిటీషియన్ గా ప్రమోట్ చేసుకోవడానికి ఇలా ప్రతి చోటా పొలిటీషియన్ అని రాస్తున్నారట.
    
మోదీ - ట్రంప్ వంటి వారు కూడా ఎన్నికలకు ముందు సోషల్ మీడియానే నమ్ముకోవడంతో ఇప్పుడు కమల్ కూడా అదే వ్యూహం అమలు చేస్తున్నారని.. ముందుగా కమల్ తన సినీ ఇమేజి నుంచి బయటపడి పొలిటికల్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో సోషల్ మీడియాలో ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారని అంటున్నారు. కొందరైతే.. పాపం, కమల్.. ఆయనే స్వయంగా పొలిటీషియన్ అని చెప్పుకోవాల్సి వస్తోందని సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News