జంపింగ్స్ విషయంలో ఏం చేయలేమన్న సుప్రీం

Update: 2015-12-11 08:33 GMT
తమ పార్టీ నుంచి వీడిపోయి తెలంగాణ అధికారపక్షంలోకి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా స్పందించింది.

ఈ విషయం స్పీకర్ పరిధిలో ఉన్నందున తాము ఏమీ చేయలేమని సుప్రీంకోర్టు తేల్చింది. పార్టీ ఫిరాయింపుల కేసులో నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ అని.. ఆయన పరిధిలోని అంశాన్ని తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. సరిగ్గా.. ఇదే మాటను రాష్ట్ర హైకోర్టు చెప్పింది. దీనిపై సుప్రీంను ఆశ్రయించిన ఎర్రబెల్లి అండ్ కోకు నిరాశ తప్పలేదు. తాజాగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య తెలంగాణ అధికారపక్షానికి ఊరటగా మారితే.. విపక్షాలు మాత్రం మరింత ఢీలా పడిపోవటం ఖాయం.
Tags:    

Similar News