సోషల్ మీడియాలో నకిలీ ఖాతాల బెడద సెలబ్రిటీలకే కాదు రాజకీయ నాయకులకు - ప్రభుత్వ విభాగాలకు - ప్రభుత్వాలకూ తప్పడం లేదు. అసలు ఖాతాలు కాకుండా ఇలాంటి నకిలీ ఖాతాల వల్ల అన్నిసార్లూ ఇబ్బందులు లేకపోయినా ఒక్కోసారి మాత్రం తప్పుడు సమాచారం చేరడం - తప్పుడు అభిప్రాయాలు వ్యాప్తి చెందడం - డ్యామేజి జరగడం వంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. అందరినీ వేధిస్తున్న ఈ నకిలీ ఖాతాల సమస్యపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అలా అని మొత్తం సోషల్ మీడియా ప్రక్షాళన ప్రాజెక్టేమీ చేపట్టడం లేదు. తమ ప్రభుత్వం - పార్టీ - నేతల వరకు ఈ ఫేక్ ఖాతాలకు బుక్కవకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకు గాను ఐటీ శాఖ యాక్షన్ ప్లాన్ ఇప్పటికే మొదలుపెట్టింది. టీడీపీ నేతల సోషల్ అకౌంట్లకు నకిలీలు లేకుండా చేసే పనిలో పడింది.
ఫేస్ బుక్ లో ప్రభుత్వం - ప్రజా ప్రతినిధుల పేరిట ఉన్న నకిలీ ఖాతాలను తొలగించడం... వాటిని నెలకొల్పినవారిని పట్టుకోవడం లక్ష్యంగా ఐటీ శాఖ సైబర్ క్రైం విభాగంతో కలిసి స్పీడు పెంచింది. ఇందుకోసం ఫేస్ బుక్ సహకారాన్నీ తీసుకుంటోంది. ఇప్పటికే గత రెండేళ్లలో ప్రభుత్వం - ప్రజా ప్రతినిధుల పేరిట ఉన్న 130 నకిలీ ఖాతాలు తొలగించారు. తాజాగా మరో 70 ఖాతాలు ఇలాంటివి గుర్తించారని.. వాటిని కూడా త్వరలో తొలగిస్తారని తెలుస్తోంది.
ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కానీ, టీడీపీ నేతల నుంచి వెలువడే సమాచారం పేరిట కానీ ఇలాంటి నకిలీ ఖాతాల ద్వారా తప్పుడు వివరాలు స్ప్రెడ్ అయితే నష్టం జరుగుతుందున్న ఉద్దేశంతో ముందే జాగ్రత్త పడుతోంది. పలువురు మంత్రుల పేరిట ఉన్న నకిలీ ఖాతాలనూ గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రజాప్రతినిధుల అధికారిక ఫేస్‌బుక్ పేజీలకు వెరిఫైడ్ మార్క్ నీలం రంగులో ఉంటుందని.. అవే అసలైన ఖాతాలుగా గుర్తించాలని ఐటీ శాఖ అధికారులు సూచించారు.