రాష్ట్ర స్థాయిలో చూస్తే.. మంత్రి పదవికి మించింది లేదన్న మాట పలువురు రాజకీయ నేతల నోట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇందుకు భిన్నమైన వాదనను వినిపించి అందరి చూపు తన మీద పడేలా చేసుకున్నారు ఎలమంచలి ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు. జిల్లాకు సంబంధించి తప్ప.. పెద్దగా వార్తల్లో ఉండని ఆయన పేరు హటాత్తుగా మీడియాలోకి రావటానికి కారణం.. ఆయన్ను టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంపిక చేయటమే.
పార్టీ అధినేత కమ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆయన కొత్త తరహాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామికి సేవ చేసే అదృష్టం తనకు లభించటం పూర్వజన్మ సుకృతమన్న ఆయన.. అధినేత తనకు వరాన్ని ఇచ్చారన్నారు. ప్రతి నెలా స్వామి వారిని తప్పనిసరిగా దర్శనం చేసుకునే తనకు.. ఈ పదవి ఇవ్వటం చాలా ఆనందాన్ని ఇస్తోందన్నారు.
జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే అయిన తనకు మంత్రి పదవి ఇస్తారని అనుకున్నానని.. అయితే ఇప్పుడు అంతకంటే ఉన్నతమైన పదవి దక్కిందన్న సంతోషాన్ని ఆయన వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా తనను ఎంపిక చేసిన జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతున్నారు. మంత్రి పదవి ఇచ్చినా జగన్ ను ఇంతగా పొగిడేవారు కాదేమో? మొత్తానికి టీటీడీ బోర్డు సభ్యుడి ఎంపిక మంత్రి పదవికి మించిందన్నట్లుగా చెప్పిన ఉప్పలపాటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని చెప్పకతప్పదు.