వాళ్లు అడిగితే మన అబ్బాయిలు తడబడ్డారంట

Update: 2015-12-24 05:12 GMT
ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి.. అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులతో ఇబ్బందులు పడిన భారతీయ విద్యార్థులకు సంబంధించిన ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అన్ని పత్రాలు ఉండి అమెరికాకు వెళ్లినా.. తమను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇబ్బంది పెట్టారంటూ 14 మంది విద్యార్థులు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. విద్యార్థులను అడిగిన కొన్ని ప్రశ్నలకు వారు సమాధానం చెప్పకపోవటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

ఒక తెలుగు విద్యార్థిని అడిగిన పలు ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోవటమే కాదు.. చాలా ప్రశ్నలకు తడబడటం కూడా వారి వీసాను రద్దు చేసి వెనక్కి పంపటానికి కారణంగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇలా ఉన్నట్లు చెబుతున్నారు.

అమెరికా అధికారి (అఆ); ఇప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బెంత?

విద్యార్థి (వి); ఒక డాలరు.. కొన్ని సెంట్లు

అఆ; డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు ఉన్నాయా?

వి; కార్డులు లేవు కానీ.. మూడు డాలర్లు ఉన్నాయి.

అఆ; మరి ఖర్చుల సంగతేంటి?

వి; ఇంట్లో వాళ్లు పంపుతామన్నారు.

అఆ; కార్డులు లేకుండా లావాదేవాలు ఎలా పంపుతారు?

వి; ఫ్రెండ్స్ అకౌంట్లకు పంపుతామన్నారు

అఆ; మీ కోర్పు ఫీజు ఎంత?

వి; ఏడాదికి పదివేల డాలర్లు

అఆ; మొదటి సెమిస్టర్ లో ఎన్ని కోర్సులు ఉంటాయి? ఒక్కోదాని ఖర్చెంత?

వి; మూడు సబ్జెక్ట్ లు ఉంటాయి. ఖర్చు సుమారు 1300 డాలర్లు. కచ్ఛితంగా అయితే తెలీదు.

అఆ; ఖర్చు గురించి ఎందుకు తెలుసుకోలేదు? ఫీజు ఎప్పటిలోపు కట్టాలి?

వి; ఈ నెల 29లోపు కట్టాలి. మిగిలిన వివరాలు ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకుంటా.

Tags:    

Similar News