నిక్కీ హేలీ తర్వాత భారతీయ-అమెరికన్, టెక్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరుఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రవేశించిన రెండవ కమ్యూనిటీ సభ్యుడిగా నిలిచాడు. అమెరికాను తిరిగి వెనక్కి తీసుకొస్తానని.. చైనాపై ఆధారపడటాన్ని అంతం చేస్తానని వాగ్దానంతో తన 2024 ప్రెసిడెన్షియల్ బిడ్‌ను వివేక్ తాజాగా ప్రారంభించారు.
మిస్టర్ రామస్వామి వయసు కేవలం 37 ఏళ్లు. అతని తల్లిదండ్రులు కేరళ నుండి యునైటెడ్ స్టేట్స్‌కు వలసవెళ్లారు. ఒహియోలోని జనరల్ ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో పని చేస్తున్నారు. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో ప్రవేశించిన రెండవ భారతీయ-అమెరికన్ గా వివేక్ నిలిచారు.
ఈనెల ప్రారంభంలో రెండు పర్యాయాలు సౌత్ కరోలినా మాజీ గవర్నర్ మరియు ఐక్యరాజ్యసమితిలో మాజీ అమెరికా రాయబారి అయిన హేలీ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం తన మాజీ బాస్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు.
వివేక్ విజయవంతమైన హెల్త్‌కేర్ మరియు టెక్నాలజీ కంపెనీలను స్థాపించాడు. 2022లో, అతను స్ట్రైవ్ అసెట్ మేనేజ్‌మెంట్‌ను ప్రారంభించాడు. రాజకీయాలపై ఆసక్తితో ఇటు దృష్టి సారించడానికి ప్రముఖ కంపెనీలు అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో రోజువారీ పౌరుల గొంతులను పునరుద్ధరించడంపై ఈయన కృషి చేస్తూ ముందుకు వచ్చారు. "నేను అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి, మనం మొదట అమెరికా అంటే ఏమిటో మళ్లీ కనుగొనాలి. నాకు, ఈ దేశాన్ని మెరిటోక్రసీ నుండి వాక్ స్వాతంత్ర్యం వరకు చలనంలోకి తెచ్చే దారులు తెలుసు. ఈ ప్రాథమిక నియమాలు.. స్వపరిపాలన దిశగా నడిపిస్తాను’ అని పేర్కొన్నాడు.. చైనా ఎదుగుదల వంటి బాహ్య బెదిరింపులను అమెరికా ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. విదేశాంగ విధానానికి ప్రాధాన్యత ఇవ్వడమేనని రామస్వామి అన్నారు.
"చైనా మన సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తోందన్న వాస్తవాన్ని మనం మేల్కొనాలి. అది రష్యన్ గూఢచారి బెలూన్ అయితే, మేము దానిని తక్షణమే కాల్చివేసి, ఆంక్షలను పెంచేవాళ్ళం. చైనా కోసం మనం ఎందుకు అలా చేయలేదు? " అని వివేక్ ప్రశ్నించాడు. మన ఆధునిక జీవన విధానం కోసం చైనా వారిపై ఆధారపడుతున్నాం. ఈ ఆర్థిక సహ-ఆధారిత సంబంధానికి ముగింపు పలకాలి," అని వివేక్ ప్రకటించాడు. ప్రెసిడెంట్ పదవికి తన ప్రచారాన్ని ప్రకటించడానికి రామస్వామి టక్కర్ కార్ల్సన్ షోను ఉపయోగించుకున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.