పాక్ అక్రమిత కశ్మీర్ లో భారత్ నిర్వహించిన సర్జికల్ దాడులు జరగనే జరగలేదంటూ పాకిస్థాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఎంత బూటకమన్న విషయం తాజాగా భారత్ మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్లో తేలిపోయింది. విదేశీ మీడియా ప్రతినిధుల్ని తీసుకొని వెళ్లిన పాక్ ప్రభుత్వం.. సర్జికల్ దాడులు జరగలేదన్నట్లుగా చూపించే ప్రయత్నం చేసి.. విదేశీ మీడియాను ప్రభావితం చేసే ప్రయత్నం చేసింది.
ఇదిలా ఉంటే.. పాక్ చేస్తున్న తొండి వాదన తప్పు అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చేందుకు భారత మీడియా రంగంలోకి దిగింది. పాకిస్థాన్ కు చెందిన వ్యక్తులతోనే ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా పాక్ కు చెందిన వ్యక్తులతో.. పాక్ అక్రమిత కశ్మీర్ లోని మీర్పూర్ రేంజికి చెందిన స్పెషల్ బ్రాంచి ఎస్పీ గులాం అక్బర్ కు ఫోన్ చేయించారు.
తాము ఉన్నతాధికారిగా తనను తాను పరిచయం చేసుకున్న మీడియా ప్రతినిధి.. సర్జికల్ దాడికి సంబంధించిన వివరాల్ని అడగాల్సిన తీరులో అడగటం.. దాడులు ఎప్పుడు జరిగాయి? దాని తీవ్రత ఎంత? లాంటి ప్రశ్నలతో మొత్తం జరిగిందంతా బయటకు వచ్చేలా చేశారు. స్టింగ్ ఆపరేషన్ అన్న విషయం తెలియని సదరు అధికారి జరిగిన విషయాన్ని పూస గుచ్చినట్లుగా చెప్పేశారు.
భారత్ జరిపిన సర్జికల్ దాడుల గురించి పాక్ ఆక్రమిత కశ్మీర్ కు చెందిన ఎస్పీ మాటల్ని చూస్తే.. ‘‘సర్.. రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత ఒక్కసారిగా కాల్పులు మొదలయ్యాయి. ఈ కాల్పులు అర్థరాత్రి 2 గంటల తర్వాత నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ సాగుతూనే ఉన్నాయి. ఇక.. మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో అయితే కాల్పులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఊహించని విధంగా కాల్పులు ప్రారంభం కావటంతో పాకిస్థానీ సైనికులకు ఏం చేయాలో తోచలేదు. వారు తేరుకునేసరికి ఐదుగురు సైనికులు మరణించారు. ఉగ్రవాదులు పెద్ద ఎత్తున మరణించారు’’ అని చెప్పుకొచ్చారు.
ఇక.. ఈ దాడుల కారణంగా ఉగ్రవాదుల భారీగా చనిపోయారని చెప్పిన సదరు అధికారి.. ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయిన విషయాన్ని మాత్రం చెప్పలేకపోయారు. తన దగ్గర ఆ సమాచారం లేదని చెప్పారు. అయితే.. చనిపోయిన ఉగ్రవాదుల్ని ట్రక్కుల్లో తీసుకెళ్లారంటూ వెల్లడించారు. ఈ సందర్భంగా భారత సైన్యం దాడులు జరిపిన ప్రాంతాల పేర్లను కూడా ఆయన వెల్లడించారు. దాడులు ముగిసిన తర్వాత ఆ ప్రాంతం మొత్తాన్ని పాక్ సైన్యం తమ అధీనంలోకి తీసుకొని జల్లెడ వేసిందని చెప్పటంతో పాటు.. ఉగ్రవాదులను ఆర్మీనే తీసుకొస్తుందని.. వారిని ఆర్మీయే కాపాడుతుందన్న విషయంతో పాటు.. సరిహద్దుల్ని దాటించేది కూడా ఆర్మీనే అంటూ సంచలన అంశాల్ని చెప్పుకొచ్చారు. మీడియా స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయిన సదరు అధికారి పరిస్థితి ఇప్పుడెలా ఉందో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/