ఆ స్వామి ద‌ర్శ‌నం కోసం జ‌గ‌న్ పార్టీ నేత‌ల క్యూ!

Update: 2019-05-29 07:28 GMT
సుప‌రిచిత‌మే కానీ.. చాలామంది పెద్ద‌గా ప‌ట్టించుకోని స్వామీజీ ఇప్పుడు ఉన్న‌ట్లుండి ప‌వ‌ర్ సెంట్రిక్ గా మారిపోయారు. ముందే ప‌రిచ‌యం చేసుకొని.. స్వామీజీ మ‌న‌సు దోచుకొని ఉంటే ఇప్పుడు ప‌రిస్థితి మ‌రోలా ఉండేదన్న భావ‌న జ‌గ‌న్ పార్టీ నేత‌ల్లో ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కూ అంత‌లా ఫేమ‌స్ అయిన స్వామీజీ ఇంకెవ‌రో కాదు.. జ‌గ‌న్  కు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితుడైన శ్రీ‌శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తీ స్వామీజీ ద‌ర్శ‌నం కోసం డిమాండ్ భారీగా పెరిగిపోయింది.

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఇప్పడు శార‌దా పీఠానికి క్యూ క‌డుతున్నారు. దీంతో.. శార‌దాపీఠానికి ఇప్పుడు రాజ‌కీయ క‌ళ వ‌చ్చేసింది.జ‌గ‌న్ కు స‌న్నిహితంగా ఉండ‌టంతో పాటు.. జ‌గ‌న్ చేతికి ప‌వ‌ర్ రావ‌టానికి అవ‌ర‌మైన యాగాలు స్వామీజీనే చేశార‌న్న ప్ర‌చారం జోరందుకుంది.

దీంతో.. జ‌గ‌న్ పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు ఇప్పుడు స్వామి ద‌ర్శ‌నానికి క్యూ క‌డుతున్నారు. తాజాగా స్వామీజీ ఆశ్ర‌మానికి వ‌చ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల లిస్ట్ చూస్తే.. వామ్మో.. ఇంత భారీగాఉందా? అనుకోకుండా ఉండ‌లేరు. ఇంత‌కూ.. స్వామీజీ ఆశీస్సుల కోసం ఇటీవ‌ల కాలంలో పీఠానికి విచ్చేసిన జ‌గ‌న్ పార్టీ నేత‌లు చూస్తే..

+  విశాఖ ఎంపీ విజేత ఎంవీవీ సత్యనారాయణ

+  అనకాపల్లి ఎంపీ విజేత సత్యవతి

+  వెంకటగిరి ఎమ్మెల్యే విజేత ఆనం రామనారాయణరెడ్డి

+  దర్శి-మద్ది వేణుగోపాల్‌

+  జగ్గయ్యపేట-ఉదయభాను సామినేని

+  బొబ్బిలి- శంబంగి చిన అప్పలనాయుడు

+  గాజువాక-తిప్పల నాగిరెడ్డి

+  పాయకరావుపేట-గొల్ల బాబూరావు

+ భీమిలి-ముత్తంశెట్టి శ్రీనివాసరావు

+  ఆమదాలవలస-తమ్మినేని సీతారాం

+  అనకాపల్లి-గుడివాడ అమర్‌ నాథ్‌

+  మాడుగుల-బి.ముత్యాలనాయుడు

+  తణుకు-కారుమూరి వెంకట నాగేశ్వరరావు

+  పెందుర్తి-అన్నంరెడ్డి అదీప్‌ రాజ్‌

+  చోడవరం-కరణం ధర్మశ్రీ

+  కాకినాడ రూరల్‌- కురసాల కన్నబాబు

+  నందికొట్కూరు- ఆర్థర్‌

+  రాయదుర్గం-కాపు రామచంద్రారెడ్డి

+ పాడేరు- కొట్టగుళి భాగ్యలక్ష్మీ

+  అరకు-చెట్టి ఫల్గుణ

+  గిద్దలూరు-అన్నా వెంకటరాంబాబు


Tags:    

Similar News