ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డిలపైనా ఈడీ దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాఘవ రెడ్డిని అరెస్టు చేసిన ఈడీ.. ఆయన కస్టడీని ఈ నెల 28 వరకు పెంచింది. ఇది పెద్ద కీలక పరిణామంగానే భావించాల్చి ఉంటుంది. ఎందుకంటే.. ప్రస్తుతం రాఘవరెడ్డి ఈడీ విచారణలోనే ఉన్నారు. అరెస్టు చేసినప్పటికీ.. ఈడీ ఆయనను తన కస్టడీలోకి తీసుకుంది.
తాజాగా శనివారం రాఘవరెడ్డిని విచారించిన ఈడీ.. కీలక ఆధారాలు సేకరించిన ట్టు తెలిసింది. ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ)కు రూ. 100 కోట్లు ఎలా వెళ్లాయనే విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు(కవిత సహా) ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఈడీ.. వాటిలో ఉన్న సమాచారం ఆధారంగా రాఘవరెడ్డిని ప్రశ్నించినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతు న్నాయి. అనంతరం.. రాఘవ రెడ్డి.. జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది.
జారీ చేసిన ఉత్తర్వులలో ఈ నెల 28వ తేదీ వరకు మాగుంట రాఘవ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా, ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన దర్యాప్తులో పురోగతి ఉందన్న ఈడీ.. మాగుంట రాఘవ రెడ్డి ఈ కేసులో కీలక ఆధారాలు తమకు అందించినట్టు తెలిపింది. ఇదిలావుంటే.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. తన విచారణకు తాజాగా డుమ్మా కొట్టారు. మార్చి 16వ తేదీన ఈడీ ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈనెల 18వ (శనివారం) తేదీన విచారణకు రావాలని మాగుంటను ఆదేశించింది.
ఈ క్రమంలో ఈడీ ఆఫీసులో విచారణకు హాజరుకావాల్సిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. డుమ్మా కొట్టారు. అరుణ్ పిళ్లై-మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కలిపి ప్రశ్నించాలని ఈడీ అధికారులు ఎదురుచూస్తుండగా ఆయన డుమ్మా కొట్టడం.. ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా ఈ కేసులో ఈడీ విచారణకు మూడోసారి వెళ్లకుండా తప్పించుకున్నారు. ఆయావిషయాలను సీరియస్‌గా పరిగణిస్తున్న ఈడీ.. వీరిని నేరుగా అరెస్టు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి