రాజస్థాన్ పై గుజరాత్ అనూహ్య విజయం!

ఐపీఎల్ సీజన్ 17లో మ్యాచ్ నెంబర్ 24లో భాగంగా... రాజస్థాన్ రాయల్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది

Update: 2024-04-11 03:50 GMT

ఐపీఎల్ సీజన్ 17లో మ్యాచ్ నెంబర్ 24లో భాగంగా... రాజస్థాన్ రాయల్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. ఇరువైపులా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసిన ఈ మ్యాచ్ ఆద్యాంతం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం!

రాజస్థాన్ బ్యాటింగ్ స్టార్ట్!:

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు రాజస్థాన్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. దీంతో.. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ లు క్రీజ్ లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఉమేశ్ యాదవ్‌ వేసిన తొలి ఓవర్లో ఆరు పరుగులు రాగా.. స్పెన్సర్‌ జాన్సన్ వేసిన రెండో ఓవర్‌ లో ఏడు పరుగులు వచ్చాయి. అనంతరం ఉమేశ్‌ యాదవ్ వేసిన మూడో ఓవర్‌ లో 9 పరుగులు రావడంతో రాజస్థాన్ స్కోరు 3 ఓవర్లకు వికెట్లేమీ నష్టపోకుండా 22 పరుగులులకు చేరింది.

తొలి వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌!:

ఉమేశ్ యాదవ్‌ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి యశస్వి జైస్వాల్ (24) ఔటయ్యాడు. దీంతో 32 పరుగుల వద్ద రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. దీంతో 5 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 41 పరుగులకు చేరింది.

రాజస్థాన్‌ రెండో వికెట్ డౌన్!:

రషీద్‌ ఖాన్‌ వేసిన ఆరో ఓవర్‌ లో నాలుగో బంతికి ఓపెనర్ జోస్ బట్లర్ (8) ఔటయ్యాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి రాజస్థాన్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 43 పరుగులకు చేరింది.

సగం ఓవర్లు పూర్తి... రాజస్థాన్ పరిస్థితి ఇది!

రషీద్‌ ఖాన్‌ వేసిన 10 ఓవర్‌ లో ఎనిమిది పరుగులు రావడంతో... సగం ఓవర్లు పూరయ్యే సరికి 2 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్... 73 పరుగులు చేసింది.

రియాన్ పరాగ్ హాఫ్ సెంచరీ!:

రాజస్థాన్‌ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ఈ సమయంలో... మోహిత్‌ శర్మ వేసిన 14 ఓవర్‌ లో నాలుగో బంతికి సిక్సర్ బాదిన రియాన్‌ పరాగ్ (55) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 14 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 118 పరుగులకు చేరింది.

సంజు శాంసన్ అర్ధ శతకం!:

స్పెన్సర్ జాన్సన్ వేసిన 15 ఓవర్‌ లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదేసిన శాంసన్... మోహిత్ శర్మ వేసిన 17 ఓవర్‌ చివరి బంతికి బౌండరీ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో 17 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 154 కి చేరింది.

రాజస్థాన్‌ మూడో వికెట్ డౌన్!:

రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. మోహిత్ శర్మ వేసిన 18.4 ఓవర్‌ కు రియాన్‌ పరాగ్ (76) ఔటయ్యాడు. దీంతో 19 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 177కి చేరింది.

గుజరాత్ టార్గెట్ 197!:

గుజరాత్‌ తో జరుగుతున్న మ్యాచ్‌ లో రాజస్థాన్‌ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్స్ లో రియాన్‌ పరాగ్ (76: 48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), సంజు శాంసన్ (68*: 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ లు) దంచికొట్టారు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, రషీద్‌ ఖాన్‌, మోహిత్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు.

లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్!:

రాజస్థాన్‌ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు గుజరాత్ బరిలోకి దిగింది. ఈ సమయంలో శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ లు క్రీజ్ లోకి దిగారు. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌ లో ఐదు పరుగులు వచ్చాయి. అనంతరం.. అవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్‌ లో 10 పరుగులు రాగా.. ట్రెంట్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో మూడే పరుగులు వచ్చాయి.

ఆ తర్వాత.. కేశవ్ మహరాజ్ వేసిన 4 ఓవర్ లో 8 పరుగులు రాగా.. అశ్విన్ వేసిన ఐదో ఓవర్ లో 4 పరుగులు వచ్చాయి. అవేశ్ ఖాన్ వేసిన ఆరో ఓవర్‌ లో 14 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి గుజరాత్ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 63 పరుగులు చేసింది.

తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్‌!:

కుల్దీప్‌ సేన్‌ వేసిన 11 ఓవర్ రెండో బంతికి సాయి సుదర్శన్‌ (35: 29 బంతుల్లో) ఔటవ్వగా.. అదే ఓవర్ లో 4వ బంతికి అభినవ్‌ (1) ఔటయ్యాడు. దీంతో దీంతో 11 ఓవర్లకు 3 వికెట్ కోల్పోయిన గుజరాత్... 83 పరుగులు చేసింది.

గుజరాత్ నాలుగో వికెట్ డౌన్!:

చాహల్ వేసిన 14 ఓవర్‌ లో చివరి బంతికి విజయ్ శంకర్ (16) క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. దీంతో 14 ఓవర్లకు స్కోరు 4 వికెట్ల నష్టానికి 111కి చేరింది.

శుభ్‌ మన్ గిల్ ఔటయ్యాడు!:

చాహల్ వేసిన 16 ఓవర్‌ లో మొదటి రెండు బంతులను బౌండరీకి పంపిన గిల్.. తర్వాతి బంతికే స్టంపౌటయ్యాడు. దీంతో 133 పరుగుల వద్ద గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఫలితంగా... 16 ఓవర్లకు స్కోరు 5 వికెట్ల నష్టానికి 138కి చేరింది.

12 బంతుల్లో 35 పరుగులు!

అవేశ్ ఖాన్‌ వేసిన 17.3 ఓవర్‌ లో షారుక్ ఖాన్‌ (14) ఔటయ్యాడు. దీంతో 18 ఓవర్లకు స్కోరు గుజరాత్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 162 పరుగులకు చేరింది. ఈ సమయంలో గుజరాత్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 35 పరుగులు అవసరం.

ఈ సమయంలో కుల్‌ దీప్ సేన్ వేసిన 19 ఓవర్‌ లో 20 పరుగులు వచ్చాయి. అంటే... గుజరాత్ విజయానికి చివరి ఓవర్‌ లో 15 పరుగులు అవసరం. ఈ సమయంలో ఆవేశ్ ఖాన్ వేసిన 20 ఓవర్ లో మొదటి మూడు బంతుల్లో రషీద్‌ ఖాన్‌ రెండు ఫోర్ల సాయంతో పది పరుగులు రాబట్టాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం ఉం డగా.. రషీద్ ఖాన్‌ బౌండరీ బాదాడు.

దీంతో... జైపుర్‌ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ లో సంజు సేనపై గుజరాత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Tags:    

Similar News