మాఫియా నుంచి కింగ్ ఖాన్ కొడుకుని కాపాడాను: అజాజ్ ఖాన్

కింగ్ ఖాన్ షారూఖ్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ నాలుగేళ్ల కింద‌ట క్రూయిజ్ షిప్ డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-03-22 03:28 GMT

కింగ్ ఖాన్ షారూఖ్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ నాలుగేళ్ల కింద‌ట క్రూయిజ్ షిప్ డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. నెల‌ల పాటు ఆర్య‌న్ జైలులో ఉన్నాడు. అయితే ఆ స‌మ‌యంలో జైల్లో మాఫియా, గూండాల‌ నుంచి కాపాడాన‌ని చెబుతున్నాడు అజాజ్ ఖాన్. అత‌డికి మంచి నీళ్లు, సిగ‌రెట్లు అందించాన‌ని అన్నాడు. అతడు ప్రమాదంలో ఉన్నాడు.. త‌న‌ను సాధారణ బ్యారక్‌లో ఉంచారు! అని అజాజ్ అన్నారు.

ఇదే చాటింగ్ సెష‌న్‌లో శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా గురించి అజాజ్ ఖాన్ ప‌లు ర‌కాల కామెంట్లు చేసారు. రాజ్ కుంద్రా ప్రతిరోజూ నాకు మెసేజ్‌లు పంపేవాడు. అతనిపై కఠినమైన నిఘా ఉండేది. కుంద్రా వచ్చినప్పుడు నేను ఏడు నెలలు జైలులో ఉన్నాను. అత‌డు నాకు స‌హాయం చేయ‌క‌పోయినా నేను చాలా సాయం చేసాను. నీరు, బిస్కెట్లు వంటివి అందించేవాడిని. జైలులో ఇలాంటివి అందించ‌డం అంత సులువు కాదు.. అని తెలిపాడు. ట్యాప్ వాట‌ర్ తాగడానికి కుంద్రా నిరాక‌రించేవాడు అని తెలిపాడు.

జైలులో ఉన్న‌ప్పుడు కుంద్రా తనకు చేసిన అన్ని సహాయాలను మరచిపోయాడని.. బద్ధాలు చూపించడం వల్ల అతడు న‌టించిన బ‌యోపిక్ సినిమా (UT69) ఫ్లాప్ అయింది అని అన్నాడు. అతను తన కథ చెప్పాడ కానీ నిజాల‌ను తెర‌పై చూపించ‌లేదు. జైలులో సాయం చేసిన వాడినే మ‌రిచాడు క‌దా.. అత‌డికి మాన‌వ‌త్వం లేద‌ని కూడా అజాజ్ ఖాన్ విమ‌ర్శించాడు.

అత‌డు ఇంకా ఏమ‌న్నారంటే... క‌రోనా స‌మ‌యంలో జైలులో అత‌డు నాతో స‌మ‌యం గ‌డిపాడు. అది కరోనా సమయం.. చాలా బాధగా ఉంది. అతడు ప్ర‌తిసారీ ఏడ్చేవాడు. జైలులో అతడిని కాపాడటానికి నేను చాలామందికి వ్యతిరేకంగా వెళ్ళాను.అయినా అత‌డు న‌న్ను ఎప్ప‌టికీ గుర్తుంచుకోలేదు! అని తీవ్రంగా విమ‌ర్శించాడు.

Tags:    

Similar News