బాహుబలిలో ఆ ఘనత ఒక్కడికే దక్కింది

Update: 2015-07-28 16:05 GMT
బాహుబలి రెండు భాషల్లో తెరకెక్కిన సినిమా. తెలుగు, తమిళ భాషల్లో వేర్వేరుగా సినిమాను షూట్ చేశారు. ఆ తర్వాత హిందీ, మలయాళ భాషల్లోకి డబ్బింగ్ చేశారు. హీరో ప్రభాస్ కేవలం తెలుగు  వెర్షన్ కు మాత్రమే డబ్బింగ్ చెప్పాడు. మిగతా భాషలకు డబ్బింగ్ ఆర్టిస్టులతో బండి నడిపించారు. రానా దగ్గుబాటికి కూడా వేరే భాషల్లో డబ్బింగ్ చెప్పించారు. నాజర్, రమ్యకృష్ణ తెలుగు, తమిళ భాషలు రెండింట్లోనూ మిగతా ఆర్టిస్టులు చాలామందికి డబ్బింగ్ అవసరమైంది. ఐతే తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లోనూ ఒకే వాయిస్ వినిపించింది మాత్రం ఒక్క రుద్ర పాత్రకు మాత్రమే.

ఈ రుద్ర పాత్ర వేసింది అడవి శేష్ అన్న సంగతి తెలిసిందే. సినిమాలో అతి తక్కువ స్క్రీన్ టైం ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ పాత్రకు డైలాగులు కూడా తక్కువే. అందుకేనేమో అన్ని భాషల్లోనూ తనే డబ్బింగ్ చెప్పాడు శేష్. సినిమాలో వీక్ క్యారెక్టర్ల లో రుద్ర ఒకటని.. మోడర్న్ లుక్ తో ఉండే శేష్ ఆ పాత్రకు సూటవ్వలేదని విమర్శలు వినిపించాయి. ఐతే తనకు మాత్రం బాహుబలి సినిమాలో నటించడం జీవిత కాల అవకాశమని అంటున్నాడు శేష్. స్క్రీన్ టైం తక్కువున్నా తన పాత్ర సినిమాకు ఎంతో కీలకమని చెప్పాడు. రెండో భాగంలో తాను లేకపోయినా.. తన పాత్ర తాలూకు ఎసెన్స్ ఉంటుందన్నాడు. బాహుబలి కథ విన్నపుడే ఇది చరిత్ర సృష్టిస్తుందని అంచనా వేశానని శేష్ చెప్పాడు.
Tags:    

Similar News