క్షణం.. మూడు వారాలుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్న సినిమా. నాలుగో వారంలోకి అడుగుపెట్టాక కూడా.. అది కూడా పరీక్షల సీజన్ లో మంచి కలెక్షన్లు సాధిస్తోంది ఈ సినిమా. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. నాలుగో వారం కూడా ఈ చిత్రానికి కొత్తగా కొన్ని స్క్రీన్లు ఇవ్వడం విశేషం. ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాను అసలు తెలుగులో తీయాలన్న ఆలోచనే తనకు ఒకప్పుడు లేదని అన్నాడు దీని రచయిత అడివి శేష్. నిజానికి ‘క్షణం’ను ఫీచర్ ఫిలింలా కాకుండా షార్ట్ ఫిలిం తరహాలో ఇంగ్లిష్ లో తీసి చిత్రోత్సవాలకు పంపించాలని అతను అనుకున్నాడట. ఐతే అనుకోకుండా తెలుగులో తీయాల్సి వచ్చిందని.. అలా తన కెరీర్ మలుపు తిరిగిందని అతను చెప్పాడు.
‘‘నేను చూసిన ఓ సంఘటన స్ఫూర్తితో ‘క్షణం’ కథ రాశాను. నిజానికి ఆ కథతో ఇంగ్లీష్ లో కొత్త నటీనటులతో సినిమా తీద్దామనుకున్నా. నా దగ్గర ఉన్న 30-40 లక్షలతో సినిమా తీయాలన్న ప్రణాళికతో ఉన్నా. ఈ పనిలో ఉండగా.. ఓ జిమ్ లో పీవీపీ గారు.. వారి ప్రొడక్షన్ చేసే వ్యక్తులు కలిశారు. వాళ్ల దగ్గర 15 నిమిషాలు అపాయింట్మెంట్ తీసుకుని.. వెళ్లి అనుకోకుండా కథ వినిపించాను. వినగానే ఇంప్రెస్ అయ్యారు. రెండు రోజుల్లోనే ఆఫీస్ ఇచ్చి పని మొదలుపెట్టమన్నారు. పీవీపీ లాంటి పెద్ద సంస్థ ముందుకు రావడంతో నా సినిమాకు పెద్ద ప్లాట్ ఫాం దొరికినట్లయింది. స్వతహాగా దర్శకుడినే అయినప్పటికీ నేను రాసిన కథను నేనే డైరెక్ట్ చేయకపోవడానికి కారణం ఉంది. నా డైరెక్షన్ లో ‘కిస్’ లాంటి డిజాస్టర్ తీశాను. అందులో ఫీల్ ఉన్నప్పటికీ ఎవరి కోసమో చేయాల్సి వచ్చింది. దీంతో ఆ తర్వాత ప్రొఫెషనల్ గా నా మనసుకు నచ్చిన సినిమాలే చేయాలని నిర్ణయం తీసుకున్నాను. డైరెక్షన్ అనేది థింకింగ్ - డిసిషన్ ప్రాసెస్ అయితే.. యాక్టింగ్ అనేది ఎమోషనల్ ప్రాసెస్. నేను ఈ రెంటినీ బ్యాలెన్స్ చేయలేననిపించి దర్శకత్వ బాధ్యతలు రవికాంత్ కు అప్పగించాను. అతను అద్భుతంగా డైరెక్ట్ చేశాడు’’ అని శేష్ చెప్పాడు.