రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్న విషయం తెల్సిందే. తన సినిమాల్లో ఎక్కువ శాతం ఎవరి పాత్రలకు వారితోనే డబ్బింగ్ చెప్పించడం రాజమౌళి ఆనవాయితి. ఈసారి కూడా సీత పాత్రలో నటిస్తున్న ఆలియా భట్ తోనే ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పించే ఉద్దేశ్యంతో ఉన్నాడట.
ఇప్పటికే ఆమెకు ఆ విషయం చెప్పడం వల్ల తెలుగు పాఠాలు నేర్చుకునే పనిలో పడిందట. లాక్ డౌన్ కు ముందు లాక్ డౌన్ సమయంలో కూడా ఆలియా తెలుగు నేర్చకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. అది డబ్బింగ్ కోసం అయ్యి ఉంటుందని ఇప్పుడు సినీ వర్గాల ద్వారా టాక్ వినిపిస్తుంది.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను తెలుగుతో పాటు హిందీ.. తమిళం.. కన్నడం.. మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ నాలుగు భాషల్లో కీలక పాత్రధారులు వారివారి పాత్రలకు డబ్బింగ్ చెప్పుకోవాల్సి ఉంటుందట. రాజమౌళి ఏం చేసినా కూడా చాలా ఆలోచించి చేస్తాడు. అందుకే జక్కన్న తీసుకున్న ఈ నిర్నయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా సమర్థిస్తున్నారు.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఇప్పటికే ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా అన్ని భాషల్లో వారితోనే డబ్బింగ్ చెప్పించాలనే నిర్ణయం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి. ఆలియాతో పాటు ఇతర స్టార్స్ కూడా సొంతంగా ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మొత్తానికి అందరిపై జక్కన్న పెద్ద బాధ్యతనే నెత్తిన పెట్టాడు.