ముక్కూ ముక్కూ రాసుకుంటూ.. వావ్..

Update: 2018-02-05 16:48 GMT
నా పేరు సూర్య సినిమా వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ కి అసలైన నిర్వచనం ఎంటో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చూపించాడు. ఆ తరువాత సినిమా సంగీత దర్శకులు విశాల్ శేఖర్ దేశభక్తిని చూపించే విధంగా రిలీజ్ చేసిన సైనిక సాంగ్ సరికొత్త ఫీలింగ్ ను కలిగించింది. ఇక ఇప్పుడు మరో సరికొత్త సాంగ్ తో చిత్ర యూనిట్ మరొక ఫీలింగ్ ను అస్వదించడానికి రెడీ అవ్వండి అంటోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమా వాళ్లు సినీ ప్రేమికులకు స్పెషల్ గా హ్యాపీ ఫీలింగ్ ను అందించేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే నా పేరు సూర్య టీమ్ పక్కాగా రెడీ అయ్యింది.

గత నెల గణతంత్ర దినోత్సవ సందర్భంగా సైనిక పాటతో అభిమానుల మదిలో దేశభక్తిని ఇంకా స్ట్రాంగ్ చేసిన ఈ టీమ్ ప్రేమికుల రోజు కూడా ప్రేమను గుర్తు చేసేలా లవర్ అల్సొ.. ఫైటర్ అల్సొ.. అనే పాటను రిలీజ్ చేయనున్నారు. విశాల్ ఈ సాంగ్ ను పాడబోతున్నారు. ముఖ్యంగా పాటలో అను ఇమ్మన్యుయల్ బన్నీ మధ్య కెమిస్ట్రీ చాలా బావుంటుందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. చాలా బన్నీ అను ముక్కూ ముక్కూ రాసుకున్నకెమిస్ర్టీ అదిరిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బన్నీ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. యాంగ్రీ మ్యాన్ లో రొమాంటిక్ బాయ్ కూడా ఉన్నాడని పోస్టర్ చెప్పకనే చెప్పింది. ఇక సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.

ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.ఇక సైనిక అనే పాటతో తన పెన్ పవర్ ని చూపించిన రామ జోగయ్య శాస్త్రి ఈ పాటను కూడా రచించారు. రీసెంట్ గా చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చెప్పింది. మొదటి పాట ఏ స్థాయిలో ఆదరణని అందుకుందో అదే స్థాయిలో ఈ రొమాంటిక్ సాంగ్ కూడా అందరికి నచ్చుతుందట.
Tags:    

Similar News