అమ్మో బన్నీ!! ఎన్ని ప్లాన్లు వేశావో...

Update: 2015-04-11 13:30 GMT
సన్‌ ఆఫ్‌ సత్యమూర్తికి తొలిరోజే మిక్సడ్‌ టాక్‌ వచ్చేసింది. అటు క్లాసూ ఇటు మాసూ ఎవ్వరికీ సినిమా సరిగ్గా నచ్చలేదు. అసలు అక్కడ ఏముందని ఎక్కడానికి అంటున్నారు. ఇక క్రిటిక్స్‌ కూడా సినిమాను సోసోగా ఉందంటూ తేల్చేశారు. తొలి వీకెండ్‌, మొదటి వారంలో కలెక్షన్లు కాస్త బాగానే ఉన్నా కూడా.. వచ్చే శుక్రవారం రిలీజ్‌ అవుతున్న సినిమా కలెక్షన్లు విపరీతంగా దెబ్బతినే ఛాన్సుంది.

కట్‌ చేస్తే.. ముందునుండీ బన్నీకి ఈ సినిమా పెద్దగా ఆడదని తెలుసా? అంటే అవుననే అంటున్నారు సినిమా ఎనలిస్టులు. బన్నీకి అన్నీ స్వయంగా తెలుసు కాబట్టే, మనోడు ప్రచారం ఊదరగొట్టేశాడని సెలవిస్తున్నారు. ఆడియో రిలీజ్‌ అయ్యేవరకు రోజుకో పాట, రోజుకో టీజర్‌, రోజుకో కొత్త పోస్టర్‌ అన్న చందంగా మనోళ్లు సన్‌ ఆఫ్‌ సత్యమూర్తిని ప్రచారం చేశారు. అక్కడితో ఆగారా.. హైదరాబాద్‌లో ఆడియో, విజయవాడలో ఆడియో సక్సెస్‌ అంటూ రచ్చ చేశారు. ఇక దాసరి లేపిన ఒక కాంట్రోవర్సీకి రుద్రమదేవి ఆడియోలో బన్నీ సమాధానం ఇచ్చాడు. అంతేకాదు.. ఏప్రియల్‌ 8న బర్త్‌డే సందర్భంగా ట్విట్టర్‌లో ఎంట్రీ ఇవ్వడానికి కూడా చాలా ప్లాను వేయించాడు బన్నీ. అయితే ఇదంతా సినిమా రిజల్ట్‌ తెలుసు కాబట్టే, హైప్‌ తేవడానికి ఇలా చేశాడా అనేది డౌటు. ఏమంటావ్‌ బన్నీ?

Tags:    

Similar News