మలయాళ చిత్రంతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన అందాల భామ అను ఇమ్మాన్యుయేల్.. న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన 'మజ్ను' మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య వంటి స్టార్ హీరోలతో అను ఇమ్మాన్యుయేల్ స్క్రీన్ షేర్ చేసుకుంది.
కానీ ఎవ్వరూ ఆమెకు హిట్ అందించలేకపోయారు. వరుస ప్లాపులు నేపథ్యంలో అను కెరీర్ క్రమంగా డౌన్ అయిపోయింది. ఈమె నటించిన 'మహాసముద్రం' సైతం గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ప్రస్తుతం ఈ అమ్మడు 'ఊర్వశివో రాక్షసివో' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.
ఇందులో అల్లు శిరీష్ హీరోగా నటించాడు. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. అనూప్ రూబెన్స్ స్వరాలు అందిస్తున్నాడు. నవంబర్ 4న వరల్డ్ వైడ్ గా ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఓ రిపోర్టర్ పై అను ఫైర్ అయింది. అందుకు కారణం అల్లు అర్జున్, అల్లు శిరీష్ లపై ప్రశ్న ఎదురవడమే. అసలేం జరిగిందంటే.. ఓ రిపోర్టర్ 'అల్లు అర్జున్ తో వర్క్ చేశారు, అలాగే అల్లు శిరీష్ తో కూడా కలిసి పనిచేశారు. ఇద్దరిలో క్యూటెస్ట్ ఎవరు..? నాటీ ఎవరు..?' అంటూ ప్రశ్నించాడు.
నిజానికి ఈ ప్రశ్న అంత వల్గర్‌గా ఏమీ లేదు. తప్పు పట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ అనూకి ఏమైందో ఏమో.. 'వేరే ప్రశ్నలేవీ లేవా అడగడానికి..? మంచి ప్రశ్నలు అడగండి' అంటూ సదరు రిపోర్టర్ పై చిరు కోపం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అనూకి అంత కోపం ఎందుకో అంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, గత కొద్ది రోజుల నుంచి అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ.. ఆఫ్ స్క్రీన్ లో కూడా కొనసాగుతుందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను రీసెంట్‌గా అల్లు శిరీష్ కొట్టి పడేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.