అరంగేట్రంలోనే బికినీ అందాలు

Update: 2016-02-03 22:30 GMT
హీరోయిన్లు బికినీలు వేయడం ఇప్పుడు సాధారణం అయిపోయింది. చాలామంది అందాల భామలు షార్ట్ కట్ లో ఫేమస్ అయిపోవడానికి బికినీలో అందాలు ఆరబోసేస్తున్నారు. కానీ ఓ కొంతమంది భామలు మాత్రం అరంగేట్రంలోనే బికినీలతో సందడి చేసేశారు.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీలో అలియా భట్ బికినీతోనే దర్శనమిచ్చింది. టీనేజ్ లోనే బికినీతో తన ఫ్రెష్ అందాలు చూపించి బోలెడుమందిని తన ఫ్యాన్స్ గా మార్చేసుకుంది. ఇప్పుడు టాప్ హీరోయిన్ స్టేజ్ కి చేరుకున్న కత్రినా కైఫ్ కూడా తన మొదటి మూవీలోనే బికినీతో అలరించింది. ఈమె బూమ్ చిత్రంలో టూ పీస్ బికినీ వేసి కుర్రకారును రెచ్చగొట్టింది. హేట్ స్టోరీ సీక్వెల్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన టీవీ నటి సుర్వీన్ చావ్లా.. బికినీలో అందాలను ఆరబోసేసింది. నషా చిత్రంతో అరంగేంట్రం చేసిన  పూనమ్ పాండే కూడా అదే సినిమాలో బికినీ వేసింది.

అలనాటి తార డింపుల్ కపాడియా కూడా తన తొలి చిత్రం బాబీలో బికినీలోనే కనిపించేసింది. పోర్న్ మూవీస్ నుంచి బాలీవుడ్ కి వచ్చిన సన్నీ లియోన్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిస్మ్ 2 ఈమె తొలిచిత్రం కాగా.. బోలెడన్ని బికినీ సీన్స్ ఉన్నాయి. రాయ్ మూవీలో కేమియో చేసిన మందనా కరిమి హీరోయిన్ గా తన తొలి సినిమా భాగ్ జానీలో టూ పీస్ బికినీ వేసింది. మిస్ యూనివర్స్ పూజా గుప్తా కూడా ఫాల్తూ చిత్రంలో బికినీతో కనిపించింది. ఎక్స్ పోజ్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇఛ్చిన జోయా అఫ్రోజ్.. బీచ్ లో బికినీతో పరుగులు పెట్టేసింది.  ఔరంగజేబ్ చిత్రంలో సాషా ఆఘా కూడా ఇలాగే బికినీతో రెచ్చగొట్టింది.

వీళ్లంతా తమ తొలి చిత్రంలోనే బికినీలు వేసి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకున్నారు. అయితే వీళ్లలో సక్సెస్‌ అయ్యింది మాత్రం కొందరే. ఒక్క కత్రినా మాత్రమే సూపర్‌ స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది.
Tags:    

Similar News