సీకే బ్రాండ్ చెప్పులు డెనిమ్స్ నిక్కరూ.. వాటీజ్ దిస్ అమ్మ‌డూ!

Update: 2023-04-26 09:18 GMT
సీకే బ్రాండ్ లోదుస్తుల‌కు ప్ర‌చారం చేస్తూ దిశా ప‌టానీ .. మ‌లైకా అరోరా.. ప్ర‌గ్య జైశ్వాల్ లాంటి భామ‌లు బాగా పాపుల‌ర‌య్యారు. అయితే ఇప్పుడు సీకే బ్రండ్ చెప్పుల‌కు ప్ర‌చారం చేస్తోంది ఇషా రెబ్బా. ఈ తెలుగ‌మ్మాయి తాజా లుక్ సంథింగ్ హాట్ అంటూ పొగిడేస్తోంది యూత్. కెల్విన్ క్లెయిన్ బ్రాండెడ్ చెప్పులు తొడుక్కున్న ఈషారెబ్బా డెనిమ్ షార్ట్ పైన వైట్ ష‌ర్ట్ తో ఎంతో హాట్ గా క‌నిపిస్తోంది.

యువ‌హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించ‌న ఈషా రెబ్బాకు స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌స‌రం. ఇటీవ‌ల కొన్ని స‌హాయ‌క పాత్ర‌ల్లోను ఈషా న‌టిస్తోంది. అందానికి అందం అభిన‌యం ఉన్నా ఎందుక‌నో ఈ భామ‌ను స్టార్ డ‌మ్ వ‌రించ‌డం లేదు. ఇక‌నైనా కొత్త ప్ర‌య‌త్నాల‌తో అనుకున్న‌ది సాధిస్తుందేమో చూడాలి.

'అంతకు ముందు ఆ తర్వాత'లో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత కూడా బందిపోటు-అమీ తుమీ-దర్శకుడు-అ! వంటి చిత్రాల్లో నటించింది. లస్ట్ స్టోరీస్ కి రీమేక్ అయిన పిట్ట కథలు అనే వెబ్ మూవీలో కూడా నటించింది.

కానీ కెరీర్ లో ఆశించినంత పెద్ద హిట్ చిత్రాలేవీ లేవు. ఇటీవ‌ల‌ గ్లామర్ షోలతో ఇషా వేడెక్కిస్తోంది. తాజాగా డెనిమ్ షార్ట్ లో ఇషా ఫోజులు అంతర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

ఈ లుక్ చూడ‌గానే ఇషా కిల్ల‌ర్ లుక్ అదిరింది అంటూ యూత్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మునుప‌టితో పోలిస్తే ఇషా ఈ ఫోటోగ్రాఫ్ లో స్ట్రైకింగ్ లుక్స్ తో ఆక‌ర్షిస్తోంది.  

థై ఎలివేష‌న్ తో ఇషా మ‌తులు చెడ‌గొడుతోంద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇషా ఇటు తెలుగు ప‌రిశ్ర‌మ‌తో పాటు త‌మిళం- మ‌ల‌యాళంలోనూ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Similar News