ఫస్ట్ లుక్: ఎరుపు పసుపు పచ్చ

Update: 2019-08-10 08:58 GMT
హీరో సిద్ధార్థ్.. మ్యూజిక్ డైరెక్టర్ కం హీరో జీవీ ప్రకాష్ లీడ్ యాక్టర్స్ గా నటించిన తమిళ చిత్రం 'సివప్పు మంజల్ పచ్చై'. 'బిచ్చగాడు' ఫేమ్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది.  'బిచ్చగాడు' తర్వాత శశి దర్శకత్వం వహించిన నెక్స్ట్ ఫిలిం ఇదే.  ఈ సినిమాను 'ఎరుపు పసుపు పచ్చ' అనే టైటిల్ తో తెలుగు లో రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ రెడీ అవుతున్నారు.  ట్రాఫిక్ సిగ్నల్స్ లోని రెడ్.. ఎల్లో.. గ్రీన్ ను సూచిస్తూ టైటిల్ ను ఫిక్స్ చేయడం ఆసక్తికరంగా ఉంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.  ఈ ఫస్ట్ లుక్ లో సిద్ధార్థ్ పిస్టల్ చేత్తో పట్టుకుని ఇంటెన్స్ లుక్ లో ఉన్నాడు. ఈ సినిమాలో స్ట్రిక్ట్ ట్రాఫిక్ పోలీస్ పాత్రలో సిద్ధార్థ్ నటించగా.. ఒక స్ట్రీట్ బైక్ రేసర్ పాత్రలో జీవీ ప్రకాష్ నటించాడు.  కాశ్మీర పరదేశి.. లిజోమోల్ జోస్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సిద్దు కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్ పై రమేష్ పిళ్ళై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

సిద్ధార్థ్ ఇప్పుడు తెలుగులో ఫామ్ లో లేడు కానీ తన చివరి చిత్రం 'గృహం' విజయం సాధించింది. మరి ఈ సినిమా సిద్ధార్థ్.. జీవీ ప్రకాష్ లకు తెలుగులో మంచి బ్రేక్ ఇస్తుందా అనేది వేచి చూడాలి. మరోవైపు దర్శకుడు శశి బిచ్చగాడు ఫీట్ ను రిపీట్ చేస్తాడా లేదా అనేది కూడా ఆసక్తి కలిగించే అంశమే.


Tags:    

Similar News