26/11 రియల్ హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా రూపొందిన 'మేజర్' చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బయోపిక్ అయినా కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఎన్నో రికార్డులను మరియు రివార్డులను సొంతం చేసుకున్న మేజర్ సినిమా యూనిట్ సభ్యులను తాజాగా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుండి ఆహ్వానం అందుకున్నారు.
మాజీ రాష్ట్రపతి ఆహ్వానం మేరకు మేజర్ హీరో అడవి శేష్ వెళ్ల కలవడం జరిగింది. మేజర్ వంటి గొప్ప సినిమాను రూపొందించినందుకు గాను అడవి శేష్ ను రామ్ నాథ్ కోవింద్ అభినందించారు. సినిమా గొప్ప విజయం సాధించిన నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి యూనిట్ సభ్యులందరిని ఆశీర్వదించారు.
ఎన్నో గొప్ప ప్రశంసలు దక్కించుకున్న మేజర్ సినిమా యూనిట్ సభ్యులకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుండి వచ్చిన ప్రశంసలు అంతకు మించి అనడంలో సందేహం లేదు.
శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మహేష్ బాబు భారీ బడ్జెట్ తో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించడం జరిగింది. ప్రకాష్ రాజ్.. సాయి మంజ్రేకర్.. శోభితా ధూళిపాళ.. రేవతి ఇంకా ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు.