సినీ వర్గాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా బాలయ్య 'అఖండ' కబుర్లే. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న 'అఖండ' చిత్రం టీజర్ 50 మిలియన్ల వ్యూస్ సాధించటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓ సీనియర్ హీరో..యంగ్ హీరోలతో ఈ స్దాయిలో పోటీ పడటం షాక్ ఇస్తోంది. 'కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది..' డైలాగ్ పై విమర్శలు వచ్చినా అదే సోషల్ మీడియాల హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో బిజినెస్ కూడా అదే స్దాయిలో జరుగుతోంది.
తాజాగా లహరి వారు ఈ చిత్రం ఆడియో రైట్స్ భారీ మొత్తం ఇచ్చి తీసుకున్నట్లు సమాచారం. ఇక 'అఖండ' శాటిలైట్ రైట్స్ ,డిజిటల్ రైట్స్ ని స్టార్ మా,హాట్ స్టార్ కలిపి 15 కోట్లుకు వెళ్ళాయి. థియేటర్ బిజినెస్ కూడా అదే స్దాయిలో జరుగుతోంది. ఇవన్నీ చూస్తూంటే....బాలయ్య 'అఖండ' మెజారిటీ సాధిస్తున్నాడని పొలిటికల్ భాషలో చెప్పుకుని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ''సింహా, లెజెండ్ తర్వాత బాలయ్యగారితో చేస్తున్న`అఖండ' సినిమాపై ప్రేక్షకులకు, అభిమానులకు హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వాటికి ధీటుగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. బాలయ్య నటవిశ్వరూపాన్నిఈ సినిమాలో మరోసారి చూస్తారు. '' అన్నారు.
చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ''మా మూవీ 'ఫస్ట్ రోర్' విడుదలైన తర్వాత సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఇప్పుడు అఖండ టైటిల్ రోర్‌తో ప్రేక్షకులలో, అభిమానుల్లో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ని అందుకునేలా బోయపాటిగారు ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మా ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌లో `అఖండ` తప్పకుండా ఒక ప్రతిష్టాత్మక చిత్రంగా నిలుస్తుంది. బాలయ్యబాబు, బోయపాటి గార్ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న 'అఖండ' నందమూరి అభిమానుల్లో పండగ తీసుకొస్తుంది. ఇప్పుడున్న ఈ కరోనా పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత త్వరలోనే థియేటర్స్‌లో కలుద్దాం'' అన్నారు.