కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల ఏడున్నర నెలలు పాటు థియేటర్స్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ చేశారు. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులతో థియేటర్స్ రీ ఓపెన్ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే ఇప్పుడు థియేటర్స్ తెరిచే వరకు ఒక గోల తెరిచాక మరొక గోల అన్నచందంగా ఇండస్ట్రీలో పరిస్థితులు తయారయ్యాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. థియేటర్స్ తెరుచుకోడానికి అనుమతి వచ్చినప్పటికీ ఫిలిం మేకర్స్ ఎవరూ ఇప్పుడే తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి మరీ థియేటర్స్ ఓపెన్ చేసుకోడానికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుని.. ఇప్పుడు మాత్రం తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేసుకునేలా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.
ప్రస్తుతం సంక్రాంతికి రేస్ లో ఉన్న సినిమాలను పరిశీలిస్తే.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' 'రంగ్ దే' 'అరణ్య' వంటి చిత్రాలు ఇప్పటికే ఫెస్టివల్ సీజన్ లో రాబోతున్నట్లు ప్రకటించాయి. అలానే 'శ్రీకారం' '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' 'ఏ1 ఎక్స్ ప్రెస్' 'చావు కబురు చల్లగా' 'రెడ్' 'వకీల్ సాబ్' ఇలా చెప్పుకుంటే పోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే ఉంది. అయితే అన్ని సినిమాలు ఒకేసారి థియేటర్స్ లో రిలీజ్ చేసినా రిటర్న్స్ తెచ్చుకోవడం ఇబ్బందే అని చెప్పాలి. అయినప్పటికీ సినిమా పండుగ రోజునే రావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఫిలిం మేకర్స్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గడిచిన ఆరేడు నెలల్లో సినిమా థియేటర్స్ కి వెళ్లకుండానే అన్ని వర్గాల ప్రేక్షకులు వేరే పద్ధతుల్లో ఎంటర్టైన్మెంట్ పొందే రీతిన అలవాటు పడిపోయారు.
ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అందరూ తమ సినిమాలను సంక్రాంతి కే రిలీజ్ చేస్తామని ఆలోచిస్తే జనం పూర్తిగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్ పొందే విధానానికి అలవాటు పడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే పనుల్లో బిజీ అవుతున్న అర్బన్ ఆడియెన్స్ కి థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసేంత టైమ్ లేదని అంటున్నారు. డైరెక్ట్ ఓటీటీ పద్ధతికి మద్ధతు తెలుపుతున్న వారిలో ఎక్కువమంది అర్బన్ ఆడియెన్స్ ఉన్నారు. ఇది నెమ్మదిగా క్రింద సెంటర్స్ కు కూడా పాకితే థియేటర్ బిజినెస్ గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇండస్ట్రీ ప్రముఖులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సినిమాల విడుదల విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మంచిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.