ఎన్టీఆర్ లాంచ్ అయిపోయింది.. మీదెప్పుడు సార్?

Update: 2023-03-24 07:00 GMT
నవీన్ కుమార్ గౌడ్.. ఈ పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ యశ్ అంటే మాత్రం భారతీయులంతా గుర్తు పడతారు. ఒక్క సినిమాతోనే దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2004లో ఉత్తరాయణ అనే టీవీ సీరియల్ ద్వారా కెరియర్ ప్రారంభించిన యశ్.. 2007లో జంబాడా హుడుగి అనే చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా చాలా చిత్రాల్లో నటించి మెప్పించాడు. కానీ దేశ వ్యాప్తంగా గుర్తింపు రాలేదు.

కానీ ఎప్పుడైతే స్టార్ డైరెకటర్ ప్రశాంత్ నీల్ తో కలిసి కేజీఎఫ్ సినిమాలో కనిపించాడో.. అతని రేంజ్ యే మారిపోయింది. ఈ ఒక్క సినిమాతో తాను అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపును దక్కించుకున్నాడు. ఇటు డైరెక్టర్ కు, అటు హీరోకు ఇద్దరికీ ఇది చాలా మంచి పేరును తీసుకొచ్చింది. అయితే ఈ చిత్రం తర్వాత యశ్ కేజీఎప్ పార్ట్ 2 తో మరిన్ని రికార్డులను సొంతం చేసుకున్నాడు. అనేక అవార్డులను కూడా దక్కించుకున్నాడు. భారతదేశ టాప్ 5 బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల్లో కూడా ఈ చిత్రం నిలిచిపోయింది.

అయితే ఈ చిత్రం తర్వాత నుంచి యశ్ నెక్స్ట్ సినిమా గురించి ఆయన ఫ్యాన్స్ చాలా ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి కథ, ఎలాంటి సినిమాతో వస్తారా అని ఆసక్తిగా చూస్తున్నారు. పార్ట 2 రిలీజ్ అయి చాలా రోజులు గడుస్తున్నా.. యశ్ నుంచి నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్ డేట్ మాత్రం రాలేదు. ఈ క్రమంలోనే ఆయన అభిమానులంతా ఇంకెప్పుడు సార్ మీ సినిమా అంటూ అడుగుతున్నారు. సామాజిక మాధ్యమాల వేధికగా రోజూ ప్రశ్నిస్తూనే ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం అంతా వేచి చూడగా... ఈరోజు ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ లాంచ్ అయిపోయింది.. మీదెప్పుడు సార్ అంటూ యశ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి యశ్ దీనిపై ఎలా స్పందిస్తారు.. నెక్స్ట్ మూవీ అప్ డేట్ ఇప్పటికైనా ఇస్తారా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News