వంద సినిమాలకు పైగా అనుభవం ఉన్న టాలీవుడ్ టాప్ మోస్ట్ సీనియర్ హీరో సినిమా ఇంకో ఐదు రోజుల్లో రిలీజవుతోంది అంటే ఎంత సందడి ఉండాలి. పబ్లిసిటీ పరంగా ఎంత రచ్చ చేయాలి. ఎన్టీఆర్ మహానాయకుడి విషయంలో అవేవి జరగడం లేదు సరికదా గత కొన్నేళ్లలో ఏ బాలయ్య సినిమాకూ రాని వీక్ ఓపెనింగ్స్ దీనికే వస్తాయేమోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ముందే ఫలితం ఊహించడం న్యాయం కాదు కాబట్టి కనీసం దాని మీద ఆసక్తి అంచనాలు పెరిగేలా చేయడం యూనిట్ కనీస బాధ్యత.
అందులోనూ హీరోకు దర్శకుడికి ఇది ఎక్కువగా ఉంటుంది. కానీ క్రిష్ మాత్రం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తప్పించి నేరుగా ఎక్కడా కనిపించడం లేదు. కథానాయకుడు డిజాస్టర్ అయ్యింది సరే. ఇప్పుడు మహానాయకుడు బాలన్స్ ఉందిగా. కనీసం దీని గురించి ఏదైనా ప్రమోషనల్ ఇంటర్వ్యూనో లేదా ఈవెంటో చేస్తే ఎంతో కొంత హైప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ జాడలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. మహానాయకుడుకి సంబంధించిన విశేషాలు కనీసం ట్విట్టర్ లోనైనా పంచుకోవడం లేదు. ట్రైలర్ మాత్రం షేర్ చేసి చేతులు దులుపుకున్నాడు.
మణికర్ణిక వివాదం కథానాయకుడు దారుణ పరాజయం మహానాయకుడికి ఆశించిన బజ్ లేకపోవడం ఇవన్నీ క్రిష్ ను బాగా డిస్ట్రబ్ చేసాయని సన్నిహితుల మాట. అయినా ఇవన్నీ పరిశ్రమలో సహజం. ఒక్క ఫెయిల్యూర్ కే అలా డీలా పడిపోవాలా. జగడం -1 నేనొక్కడినే డిజాస్టర్స్ వచ్చినప్పుడు సుకుమార్ ఆలోచనా పాజిటివ్ గా లేకపోతే రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ వచ్చేదా. క్రిష్ ఆ కోణంలో ఇంకా ఆలోచించలేదేమో. ఏది ఏమైనా ఈ సైలెన్స్ మహానాయకుడుకి మంచిది కాదనే వాస్తవాన్ని గుర్తిస్తే మంచిది. నష్టం ఉందా లేదా అనేది శుక్రవారం తేలిపోతుంది