అతిలోక సుందరి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జాన్వీ కపూర్ ధడక్ మూవీతో హీరోయిన్ గా అడుగుపెట్టి తనదైన శైలిలో దూసుకుపోతోంది.
ఇప్పుడు దేవరా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఖుషి కపూర్ డెబ్యూ మూవీపై బాలీవుడ్ లో ఆసక్తికర చర్చ మొదలైంది.
దీనికి కారణం కూడా ఉంది. ఇదే సినిమాతో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కూడా హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఇద్దరు స్టార్స్ వారసులు కలిసి నటించబోయే ఈ సినిమా సౌత్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ రీమేక్ కావడం విశేషం. ప్రదీప్ రంగనాథ్, ఇవానా జోడీగా తమిళంలో తెరకెక్కి సూపర్ హిట్ అయిన లవ్ టుడే సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం ఖుషి కపూర్, జునైద్ ఖాన్ ని లీడ్ క్యాస్టింగ్ గా ఖరారు చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా కొత్తవాళ్ళు ఉంటే కంటెంట్ ని మరింత భాగా ప్రెజెంట్ చేయొచ్చు అని భావించి వీరిద్దరిని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఫాంటమ్ స్టూడియోస్ ఈ సినిమాని ఒరిజినల్ నిర్మించిన ఏజీఎస్ వారితో కలిసి నిర్మిస్తోంది.
అయితే తమిళంలో లో బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీలో మాత్రం కాస్తా రిచ్ గానే ఆవిష్కరించే పనిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. స్టార్ కిడ్స్ కావడంతో కచ్చితంగా అభిమానుల దృష్టి మూవీపై పడనుంది. ఇక లవ్ టుడే టైటిల్ తోనే హిందీలో కూడా తెరకెక్కే ఛాన్స్ ఉంది. మిగిలిన క్యాస్టింగ్ కోసం ఆర్టిస్ట్స్ ఎంపిక జరుగుతుందంట.
ఇదిలా ఉంటే ఈ సినిమాని అమీర్ ఖాన్ తో లాక్ సింగ్ చద్దా సినిమా చేసిన అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు బిటౌన్ లో వినిపిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ స్టార్ట్ అవుతుందంట. మరి ఈ సినిమాతో ఈ స్టార్ కిడ్స్ సిల్వర్ స్క్రీన్ పై ఏ మేరకు మెప్పిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.