మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు చిత్రవిచిత్రాల్ని పరిచయం చేస్తున్నాయి. ఇక్కడ అంతా వింతాట సాగుతోంది. ప్రజాస్వామ్యంలో ఒక సాధారణ ఎన్నికల మాదిరిగా ఎవరికి వారు రాజకీయాలు చేసేందుకు పోటీపడడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆర్టిస్టుల సంఘం ఎంతటి ప్రతిష్ఠాత్మకమో గడిచిన కొద్దిరోజులుగా జరుగుతున్న వ్యవహారాలు పబ్లిక్ కి వంట పట్టేలా చేస్తున్నాయి.
`మా` అధ్యక్ష పదవికి ఆరుగురు సభ్యులు పోటీపడుతుండడం ఇంకా ఇంకా కొత్త పేర్లు తెరపైకి వస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రకాష్ రాజ్- మంచు విష్ణు- జీవిత- హేమ- సీవీఎల్ నరసింహారావు ఇలా ఎవరికి వారు తమవైన రాజకీయాల్ని రక్తి కట్టిస్తున్నారు. అయితే ఇంతలోనే సహజనటి జయసుధ పేరు ఆకస్మికంగా తెరపైకొచ్చింది. కప్పల తక్కెడలా ఉన్న మా కమిటీ వ్యవహారంలో ఒక లేడీ అధ్యక్షురాలు అయితే బావుంటుందని సినీపెద్దలు సహా మా వర్గీయులు అంతా భావిస్తున్నారని కథనాలొచ్చాయి.
చిరంజీవి- మోహన్ బాబు వంటి ప్రముఖులు జయసుధకు అధ్యక్ష పదవిని ఏకగ్రీవం చేసే ప్లాన్ లో ఉన్నారని గుసగుసలు వినిపించాయి. అయితే ఇన్ని జరుగుతున్నా.. ఇంకా ప్రకాష్ రాజ్ కి పదవిపై ఆశ చావలేదని ఆయన తనవంతు ప్రయత్నాల్లో ఉన్నారని తాజాగా మరో గుసగుస వేడెక్కిస్తోంది. జయసుధకు ఆయన కూడా మద్ధతిస్తున్నారని చెబుతున్నా.. గుట్టు చప్పుడు కాకుండా ప్రకాష్ రాజ్ తన పని తాను చేసుకుపోతున్నారు. సినీపెద్దల్ని మా సభ్యులను కలుస్తున్నారు. మంత్రాంగం నడిపించేస్తున్నారు. ఆయన తరపున మెగా బ్రదర్ నాగబాబు మా సభ్యులతో మంతనాలు సాగిస్తున్నాని తెలుస్తోంది.
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ని ఆయన కేవ్ లో నాగబాబు కలిసారని తెలిసింది. అక్కడ సుదీర్ఘంగా మంతనాలు సాగించారని ప్రకాష్ రాజ్ కి మద్ధతునివ్వాల్సిందిగా నాగబాబు కోరారని కథనాలొస్తున్నాయి.
ప్రకాష్ రాజ్ ఇంతకుమందే చిరంజీవిని కలిసారు.. పైగా చిరు మద్ధతు ప్రకాష్ రాజ్ కి ఉంటుందని నాగబాబు అధికారికంగానే ప్రకటించారు. దీంతో ఆయనే అధ్యక్షుడు అవుతారా? అన్న చర్చా సాగుతోంది. ప్రకాష్ రాజ్ గెలుపే ధ్యేయంగా మెగా బ్రదర్ పని చేస్తున్నారు కాబట్టి ఇతర ఊహాగానాలేవీ నమ్మాల్సిన పనే లేదని కూడా భావించాల్సి వస్తోంది.