మ‌హేష్ ఓ అయ‌స్కాంతం కెమెరాను కూడా లాగేస్తున్నాడు!

Update: 2021-03-17 15:45 GMT
ప్రిన్స్ మ‌హేష్ బాబు ఇప్పుడు 'స‌ర్కారు వారి పాట‌'తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. గ్యాప్ లో యాడ్ షూట్ లు కూడా కానిచ్చేస్తున్నాడు సూపర్ స్టార్. లేటెస్ట్ గా హావెల్స్ కంపెనీకి చెందిన ఓ యాడ్ షూట్ లో పాల్గొనబోతున్నాడు. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగా ఈ యాడ్ ను షూట్ చేస్తున్నాడు.

ఇందులో భాగంగా.. లేటెస్ట్ గా ఫొటో షూట్ నిర్వ‌హించారు. ముంబై ఫ్యాష‌న్, అడ్వ‌ర్టైజింగ్ సెల‌బ్రిటీ ఫొటో గ్రాఫ‌ర్ అవినాష్ గోవారిక‌ర్ ఈ ఫొటోల‌ను షూట్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న మహేష్ ఫొటోను ట్విట‌ర్ లో పోస్టు చేసిన గోవారిక‌ర్‌.. సూప‌ర్‌ క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు.మ‌హేష్ బాబుతో ఫొటో షూట్ కంప్లీట్ అయ్యింద‌ని రాసుకొచ్చిన ఆయ‌న‌.. ప్రిన్స్ లో అయ‌స్కాంతం ఉంద‌ని, అది కెమెరాను కూడా లాగేస్తోంద‌ని ఫినిష్ చేశారు. ఆయ‌న పోస్టు చేసిన ఫొటోతోపాటు గోవారిక‌ర్ కామెంట్ కూడా తెగ వైర‌ల్ అవుతోంది.

ఈ ఫొటోలో మ‌హేష్ మ‌రీ యంగ్ గా క‌నిపిస్తున్నాడు. యాభై సంవ‌త్స‌రాల‌కు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న ప్రిన్స్‌.. రోజు రోజుకూ కుర్రాడిలా మారిపోతున్న‌ట్టుగా ఉన్నాడు. ఈ టాలీవుడ్ ప్రిన్స్‌.. మ‌రింత మిల్క్ బాయ్ గా షైన్ అవుతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.
Tags:    

Similar News