అవును.. నోరు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడితే చట్టం ఊరుకోదు కదా? తనకున్న ఇమేజ్ తో యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసిన నటి కమ్ మోడల్ మీరా మిథున్ కు తాజాగా బెయిల్ ఇచ్చేందుకు నో అంటే నో చెప్పేసింది చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు. ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారాయి. ఎలా చూసినా.. ఆమె లక్ష్మణ రేఖల్ని పూర్తిగా దాటేశారని చెప్పాలి. హద్దుల్ని దాటేసిన ఆమె అందుకు తగ్గ ఫలితం అనుభవిస్తున్నారు.
ఈ మధ్యన ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దళితుల్ని చిత్ర పరిశ్రమను నుంచి తరిమికొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. దళిత దర్శకులు తీస్తున్న చిత్రాలతో సినీ పరిశ్రమ విలువ తగ్గుతుందంటూ దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్న వీసీకే పార్టీ నేత వన్నియరసు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఆమెను అరెస్టు చేయటం ఖాయమన్న మాట వినిపించినంతనే.. భయపడి పారిపోయారు. దీంతో ఆమె కోసం వెతుకులాడిన పోలీసులు ఆమె కేరళలో తలదాచుకున్నట్లు గుర్తించారు. వెంటనే.. స్పెషల్ సైబర్ క్రైమ్ పోలీసులు కేరళకు వెళ్లి.. ఆమె ఎక్కడ ఉందో అక్కడకు వెళ్లి ఆమెను అరెస్టు చేశారు. అనంతరం చెన్నైకి తీసుకొచ్చి రిమాండ్ చేశారు.
తాజాగా ఆమె తనకు బెయిల్ ఇవ్వాలని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె స్నేహితుడు అభిషేక్ సైతం పిటిషన్ దాఖలు చేశారు. వీటిని విచారించిన కోర్టు.. ఆమె.. ఆమె స్నేహితుడు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టేవేశారు. చూస్తుంటే అమ్మడుకు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం తక్కువనే మాట వినిపిస్తోంది.